ఇటీవలి కాలంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు గోధుమ నారు రసాన్ని వినియోగించటం కనిపిస్తోంది. రసాయన ఎరువులు వాడకుండా పెంచిన తాజా గోధుమ నారు నుంచి తీసిన రసాన్ని సేవించటం వల్ల శరీరానికి పలు పోషక పదార్థాలు లభిస్తాయి. రోజూ క్రమం తప్పక దీన్ని సేవిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరగటంతో బాటు మధుమేహం వంటి పలు సమస్యలూ అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి రోజుల్లో స్థలాభావం మూలంగా అందరూ ఇంట్లో దీన్ని పెంచలేకపోతున్నారు. ఇలాంటివారికోసం గోధుమ నారు పొడి రూపంలో, మాత్రల రూపంలోనూ లభిస్తోంది. దీని ఉపయోగాలు... 

 • రోజూ ఒక గ్లాసు ఈ రసం తాగేవారిలో ప్రాణశక్తి ఉద్దీపితమవుతుంది. కాఫీ ,టీ లతో బాటు మద్యపానం వంటి వ్యసనాలూ వదిలిపోతాయి.
 • రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది.
 • రోజూ ఈ రసాన్ని తీసుకొనేవారి శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు వదిలిపోతాయి.
 • శరీరంలోని హానికారక బాక్టీరియాను తొలగించి రోగాలు రాకుండా నివారిస్తుంది. ఇది మంచి చర్మ రోగ నివారిణి. ఈ రసాన్ని చర్మం పై పూస్తే పుండ్లు, అలెర్జీలు, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి.
 • మధుమేహులు రోజూ ఈ రసాన్ని సేవిస్తే అదుపుతప్పిన మధుమేహం దారికొస్తుంది.
 • ఈ రసంతో నోరు పుక్కిలిస్తే దంత సమస్యలు , నోటి దుర్వాసన వంటి సమస్యలు తొలగిపోతాయి.
 • ఈ రసం వినియోగించే వారి కండరాలు, ఎముకలకు ధృఢత్వం చేకూరుతుంది.
 • ఈ రసం తీసుకొనేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తశుద్ధి కూడా జరుగుతుంది.
 • ఈ రసం సేవించేవారిలో జీవక్రియలు ఊపందుకోవడం, శరీర కదలికలో మెరుగుదల వంటి మార్పులు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్యలు, జీర్ణావయవ సమస్యలు తొలగిపోతాయి.
 • మొక్కలు పచ్చగా ఉండేందుకు కారణమైన క్లోరోఫిల్ ఈ రసంలో లభిస్తుంది. వరి, జొన్న, రాగి వంటి ఇతర నారు రసం కంటే ఇది భిన్నమైనదని పరిశోధనల్లో తేలింది.
 • ఈ రసంలో ఉండే ఆక్సిజన్ క్యాన్సర్ కణుతుల ఎదుగుదలను నిరోధిస్తుంది. రేడియేషన్, కీమో థెరపీ కారణంగా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను సైతం ఈ రసం తగ్గిస్తుంది.
 • కేశాల ఆరోగ్యం మెరుగుపడేందుకు, సంతాన లేమి సమస్యలకు ఇదొక మంచి ప్రత్యామ్నాయం.

నారు పెంపకం

ఇంటి పెరడులో లేదా పెద్ద కుండీలలో దీన్ని పెంచుకోవచ్చు. సారవంతమైన మట్టిలో గోధుమలు చల్లి తగుమాత్రంగా తడిపితే చాలు. మరీ ఎక్కువ సూర్యరశ్మి కూడా అక్కర లేదు గనుక చెట్ల నీడలో కూడా పెంచవచ్చు. ఈ నారు 1 అడుగు ఎత్తు పెరిగిన తర్వాత కోసి కింది ఆకులు తీసివేసి తడిపి మిక్సీ పట్టుకొని ఆ రసం తాగాలి. ఎప్పటికప్పుడు ఈ రసాన్ని తీసుకోవాలి తప్ప నిల్వ ఉంచింది వాడరాదు. బయట నారు కొనేవారు దాన్నిఫ్రిజ్ లో పెట్టి కొద్దికొద్దిగా వాడుకోవచ్చు. రసం తీసిన వెంటనే త్రాగటం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE