కావల్సిన పదార్థాలు

బియ్యం, కందిపప్పు- కప్పు చొప్పున, చింతపండు గుజ్జు- గరిటెడు, వంకాయ, గుమ్మడి ముక్క, బెండకాయ, 5 చిక్కుడుకాయలు, క్యారెట్‌, చిలగడదుంప, బంగాళాదుంప, క్యాప్సికం, బఠాణీ- అన్నీ కలిపి 4 కప్పులు, సాంబారుపొడి-  చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - 2 చెంచాలు, జీలకర్ర - చెంచా, కొత్తిమీర తరుగు -చెంచా, కరివేపాకు రెబ్బలు - 2 

తయారీ

కప్పు బియ్యంలో 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చాక దించాలి. రెండు వేర్వేరు పాత్రల్లో కందిపప్పూ, కూరగాయ ముక్కల్ని విడివిడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి వేసి వేడెక్కాక అందులో జీలకర్ర,  కరివేపాకు వేయించి ఉడికించిన కూరగాయముక్కలు వేయాలి. తరవాత సాంబారుపొడీ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేసి కలిపి 5 నిమిషాల తర్వాత ఉడికించిన కందిపప్పు కలిపి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా అందులో అన్నం వేసికలిపి  కొత్తిమీర తరుగు చల్లితే కదంబం సిద్దమైనట్లే. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE