మేలైన, చౌకైన పౌష్టికాహారం గుడ్డు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తినదగిన ఆహారమిది. యువత, ఎదిగే పిల్లలకు తగినన్ని ప్రొటీన్లను అందించటం, పోషకాహార లోపంతో బాధపడేవారిని త్వరగా కోలుకునేలా చేయటంలో దీని పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. పలు అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ వంటి ఎన్నో కీలక పోషకాల సమాహారమిది. గుడ్డు విశేషాలను విస్తృతంగా ప్రహారం చేయటం ద్వారా అందరూ దాన్ని తీసుకొనేలా చేసేందుకే.. ఏటా అక్టోబర్‌ రెండవ శుక్రవారం రోజును ప్రపంచ గుడ్డు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 

కొన్ని ఉపయోగాలు...

  • బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. గుడ్డులోని మేలైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది కనుక తక్కువ ఆహారానికే పరిమితమవుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇదో మంచి ప్రత్యామ్నాయ ఆహారం.
  • గుడ్డు కేవలం 80 క్యాలరీలు శక్తినిస్తుంది కనుక డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.
  • రోజుకో గుడ్డు తినేవారికి చిన్న వయసులో కంటిచూపు తగ్గటం, శుక్లాల వంటి సమస్యలు రావు.
  • గుడ్డులో ప్రధానమైన జీవపోషకమైన విటమిన్‌-ఎ మొదలు జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ విరివిగా లభిస్తాయి.
  • గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది.

అపోహలు వద్దు

 రోజూ గుడ్డు తింటే గుండెజబ్బు వస్తుందని, వేడిచేస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ కేవలం అపోహే. రోజూ గుడ్డు తినేవారికి సైతం పై సమస్యలు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు గుడ్డు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. కానీ.. ఆహారంలో హానికారక శాచురేటెడ్, ట్రాన్స్ ప్యాట్లు ఉన్నప్పుడే కాలేయం చెడు కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేస్తుంది.

గమనిక

గుడ్డు మంచిదని రోజుకు నాలుగేసి గుడ్లు తినడం మంచిది కాదు. సరిగా ఉడికించిన గుడ్లను రోజుకు ఒకటి రెండు నిరభ్యంతరంగా తినొచ్చు.Recent Storiesbpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE