ఏదైనా అనారోగ్యం పాలై కోలుకున్న తర్వాత రెండు రోజులైనా పొట్లకాయను పత్యంగా పెడతారు. ఎందుకంటే ఇది తేలికగా జీర్ణమవటమేగాక ఇందులో బోలెడంత పీచు పదార్ధం వుంటుంది. దీనివల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. పొట్లకాయ వంటకాల్లో పెరుగుపచ్చడి ఒకటి. ఒంట్లో చేరిన వేడిని తగ్గించటానికి ఈ వంటకం బాగా పనికొస్తుంది. 

కావలసినవి

పొట్లకాయ- 1, అల్లం- అరా అంగుళపు ముక్క, గట్టి పెరుగు (కొద్దిగా పులుపుగా ఉంటే మంచిది)- పావుకిలో, పచ్చి మిర్చి- 3, ఎండు మిర్చి-1, మినప పప్పు- అరచెంచా, జీలకర్ర, ఆవాలు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, కరివేపాకు -2 రెమ్మలు, నూనె- 2 చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా 

చేసే పద్ధతి

  • ముందుగా పొట్లకాయను కడిగి ముక్కలుగా తరగాలి. ప్రెషర్ పాన్ లో తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలు, తగినంత ఉప్పువేసి 1 విజిల్ వచ్చేవరకు ఉడికించి సిమ్ లో పెట్టి మరో విజిల్ రాగానే స్టవ్ ఆపేసుకోవాలి.
  • ప్రెషర్ విడుదల అయ్యేలోపున అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని మీగడ తరకలు లేకుండా గరిటతో కలిపి అల్లం, పచ్చి మిర్చి ముద్ద కలుపుకోవాలి.
  • ఆవిరి పోయిన తర్వాత పాన్ మూత తీసి ముక్కలు తీసి అవి చల్లారాక నేరుగా పెరుగులో కలపాలి.(వేడి ముక్కలు వేస్తే పెరుగు విరిగినట్లుగా అయిపోతుంది)
  • చివరగా చక్కగా పోపు పెట్టుకొంటే పచ్చడి రెడీ అయినట్టే.
  • ఇది అన్నం, చపాతీ, పరాటాల్లోకి చాలా బాగుంటుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE