కావలసినవి

శనగపిండి - 2 గ్లాసులు

నెయ్యి  - 1 గ్లాసు  

చక్కెర - 2 గ్లాసులు 

తయారీ 

శనగపిండిని జల్లెడ పట్టాలి. కళాయిని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా డాల్డా వేసి అడుగంటకుండా దోరగా వేయించుకోవాలి. గిన్నెలో కొద్ది నీరు, చక్కెరను వేసి పాకం వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. పాకం తయారైన తరువాత దాంట్లో శనగ పిండి వేసి గట్టి పడే వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని  శనగ పిండిలో పోయాలి. మాడిపోకుండా కలుపుతూ నెయ్యి పోస్తూ ఉండాలి. ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది. తరువాత మరోసారి డాల్డా వేసి కలుపుకుని ఒక పెద్ద గిన్నెలో లేదా పెద్ద డబ్బాలో ఈ మిశ్రమాన్ని సరిపడేంత వరకు మందంగా పోసుకుని చాకుతో ముక్కలుగా కోసుకుని 10 నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి. దీంతో రుచికరమైన మైసూర్ పాక్ తినడానికి తయారైనట్టే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE