కావలసినవి

విరిగిన పాలు  - 1 లీటర్

నెయ్యి            - 100 గ్రాములు

చక్కెర            - 400 గ్రాములు

యాలకులు    -  4 

తయారీ

ముందుగా ఒక గిన్నెలో విరిగిన పాలను పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద నీరంతా పోయే వరకు పెట్టాలి. నీరంతా ఆవిరైపోయిన తరువాత పొడి జున్నులాగా అది తయారవుతుంది. దీన్ని తడి చేతులతో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అనంతరం పొయ్యి మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేసి మరిగించాలి. నెయ్యి వేడి అయ్యాక అందులో పాల ఉండలు వేసి వేగనివ్వాలి. అప్పుడప్పుడు గరిటెతో కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి. అనంతరం ఒక గిన్నెలో నీరు, చక్కెరని వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో ఉండలు, యాలకుల పొడిని చల్లి ఒక గంట సేపు నానబెడితే పాల రసగుల్ల తయారైనట్టే.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE