కావలసినవి

కొబ్బరి తురుము - 3 కప్పులు

మైదా - అరకేజీ,

యాలకులు - 3

నెయ్యి -  100 గ్రాములు,

గసగసాలు – 100 గ్రాములు.

బెల్లం - పావుకేజీ 

తయారీ

ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని ఓ ప్యాన్‌లో వేసి సన్నని సెగపై ఫ్రై చేయాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. తర్వాత ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మైదాపిండిలో నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.  

ఈ మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ఒక్కోదాన్ని చిన్నపూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE