నిమ్మజాతి పండ్లలో నారింజ ముఖ్యమైన ఫలం. తీపి, పులుపు కలగలసిన రుచితో బాటు బోలెడన్ని పోషకాలనందించే నారింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజను సంస్కృతంలో 'నారంగ-ఐరావతి' అనీ, హిందీలో 'నారంగీ', 'సంతరా' అంటారు. నారింజ శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగించి యవ్వనాన్ని పెంపొందించటమే గాక మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. నారింజలో పుల్ల, తీపి నారింజ అనే 2 రకాలున్నాయి. వీటిలో వానాకాలంలో వచ్చే పుల్ల నారింజలో నీరు అధికంగా, లవణాలు తక్కువగా, వేసవిలో వచ్చే తీపి నారింజలో కాస్తాయి. వీటిలో నీరు తక్కువ, లవణాలు ఎక్కువ.

ప్రత్యేకతలు

  • నారింజలో తక్కువ విటమిన్ ‌- ఏ, బి, ఎక్కువ విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం త్రాగితే రోజుకు కావాల్సిన విటమిన్‌ లభిస్తుంది.
  • నారింజ పండు తొనల పైపొరల్లో విరివిగా ఉండే కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది.
  • నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది. నారింజ సహజసిద్ధంగా పండినప్పుడు, దానిలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారి తిన్న పండు సులభంగా జీర్ణమవుంటుంది.
  • జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి.

ఉపయోగాలు

  • మలబద్ధక బాధితులు రోజూ రాత్రి పడుకునే ముందు, ఉదయం స్నానానంతరం 2 నారింజ పండ్లు తింటే సుఖవిరేచనం అవుతుంది.
  • నారింజ పండు వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.
  • చిగుళ్ల వాపు, రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి పలు దంత సమస్యల బాధితులు నారింజ రసాన్ని సేవిస్తే ఇబ్బంది తగ్గుతుంది.
  • జ్వరం, అనారోగ్యం కారణంగా జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే వేగంగా కోలుకోవటమే గాక జీర్ణ శక్తి పుంజుకొంటుంది. నారింజ వినియోగంతో పేగుల్లోని క్రిములు నశిస్తాయి.

పోషకాల నారింజ

నీరు - 87.8%

కాల్షియం - 0.5% మై.గ్రా

మాంసకృత్తులు - 0.9%

పిండి పదార్ధలు - 10.6%

సల్ఫర్ - 0.2% మై.గ్రా

క్రొవ్వు - 0.3%

ఐరన్ - 01% మై.గ్రా

లవణాలు - 0.4%

విటమిన్‌ - ఏ - 350 I.U

విటమిన్‌ - బి1 - 120 I.U

విటమిన్‌ - సి - 68 I.URecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE