అత్యధిక పోషక విలువలు, బోలెడన్ని ఔషధగుణాలను అందించే నూనెగింజల్లో నువ్వులు ప్రధానమైనవి. అందుకే మన రోజువారీ ఆహారంలో తరచుగా నువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యానికి నువ్వులు చేసే మేలు గురించిన కొన్ని వివరాలు...
- నువ్వుల్లో పుష్కలంగా లభించే ప్రొటీన్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
- నువ్వుల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటును, నువ్వుల్లోని నూనె మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
- నువ్వుల వినియోగంతో రక్తంలో చేరిన అధిక కొవ్వు వదిలిపోయి హృద్రోగాల ముప్పు తగ్గుతుంది.
- పలు జీర్ణ సమస్యలను దూరం చేసి తిన్న హారం ఒంటికి పట్టేలా చేసే గుణం నువ్వులకు ఉంది.
- నువ్వుల నూనె క్యాన్సర్ కారకాలను అడ్డుకోవటంతో బాటు పలు చర్మ వ్యాధుల్ని దరి చేరనివ్వదు. నువ్వుల్లో జింక్ చర్మకాంతిని పెంచుతుంది.
- నువ్వులోని ప్రత్యేక పోషకాలు మానసిక ఒత్తిళ్లను తగ్గించి సుఖనిద్రకు దోహదం చేస్తాయి.
- నల్ల నువ్వుల్లో ఉండే అధిక ఐరన్ నిల్వల మూలంగా రక్తహీనత వంటి సమస్యలు దరిజేరవు.
- మద్యపానం చేసేవారిలో తలెత్తే కాలేయ సమస్యలకు నువ్వుల వినియోగం మంచి విరుగుడు.
- నువ్వులు, బెల్లం కలిపి తింటే కాల్షియం లోపాలు తొలగి ఎముకలు బలిష్టంగా మారతాయి.
- మేలైన నేత్ర ఆరోగ్యం కోరుకొనేవారంతా నువ్వులు వాడాల్సిందే. ముఖ్యంగా వయసురీత్యా వచ్చే నేత్ర సమస్యలను ఆలస్యం చేయటంలో నువ్వుల వినియోగం ఎంతో దోహదం చేస్తుంది.
- నువ్వుల నూనె కురులకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలకుండా చూస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.