ఈ రోజుల్లో తినే కూరగాయలూ, పండ్లు, ధాన్యమూ కల్తీ మయమైపోయాయి. ఒకప్పుడు మన దేశ జనాభాకు తగినంత ఆహారంకోసం హరిత విప్లవాన్ని ఆశ్రయించి ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పెంచి మొత్తానికి ఆహారభద్రతను సాధించుకున్నాం. కాలక్రమంలో పంటల్లోనే కాకుండా పండ్లు, కూరగాయల సాగులో కూడా పురుగు ఈ రసాయనాల వాడకం పెరిగి ఇప్పుడు తినే ఆహారం మొత్తం విషతుల్యమైన దుస్థితి దాపురించింది. ఈ ధోరణి మూలంగా భూమి, జలవనరులు సైతం విష ప్రభావానికి లోనై పర్యావరణ హితమైన మొక్కలు, జీవరాసులు అంతరించి పోతున్నాయి. ఈ ప్రపంచ సమస్యకు ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం సేంద్రీయ వ్యవసాయమే. దాన్నే వ్యవసాయ పరిభాషలో 'ఆర్గానిక్ ఫామింగ్' అనీ అలా సాగు చేసిన ఉత్పత్తులను 'ఆర్గానిక్ ఫుడ్' అనీ అంటున్నారు.

సేంద్రీయమే ఎందుకు?

రసాయనాలు, క్రిమిసంహారిణులు వాడిన పంటకు, అవి లేకుండా సహజసిద్ధంగా పండిన పంటలకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సేంద్రీయ పంటలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. సేంద్రీయ ఆహారంతో శారీరక వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. అత్యధిక కేలరీలు లోనికి వెళ్లవు. త్వరగా జీర్ణమై జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటి, గ్యాస్‌, ఉదర సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకసారి సేంద్రీయ ఆహారం తినటం మొదలుపెడితే శరీరంలోపలి మార్పులు ఎవరికి వారు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.

గుర్తుపట్టడమెలా?

  • ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, గింజలు మరీ బలిష్టంగా, మెరుస్తూ గాజా కేవలం సాదాసీదాగా ఉంటాయి. ఒకే ఉత్పత్తి వేర్వేరు సైజులో ఉంటుంది. రంగు, ఆకారంలోనూ ఈ మార్పు కనిపిస్తుంది.
  • ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, గింజలు త్వరగా ఉడుకుతాయి. కమ్మని రుచిగా ఉంటాయి.
  • ఇవి సహజ సువాసన కలిగి ఉంటాయి. కూరగాయలు, పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది.
  • మార్కెట్లో చిల్లులు పడ్డ ఆకుకూరలు కనిపిస్తే వాటికి తక్కువ మందులు తక్కువ వాడారని అర్థం. కనుక వాటిని కొనొచ్చు.

వివరాలు చూసే కొనాలి

ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టిన ప్రిజర్వేటివ్‌ కూరగాయాలు కొనేటప్పుడు అవి పెట్రోలియం ఆధారితమైనవేమో చూడాలి. వీలున్న మేరకు వాటిని వాడొద్దు. ఆర్గానిక్ పద్దతిలో సాగుచేసిన ఉత్పత్తులున్న కవర్ల మీద ఉండే స్టిక్కర్లలో 5 అంకెల సంఖ్య లేదా 9 అంకెల సంఖ్య ఉంటే సేంద్రీయం అనీ, 4 సంఖ్యల అంకె ఉంటే అది క్రిమిసంహారకాలతో పండించినవని గుర్తించాలి.

ఇలా వాడాలి..

  • ఆర్గానిక్ కూరగాయలను కడిగి కోయాలి తప్ప కోసి కడగరాదు. ఒకవేళ కోశాక కడిగితే వాటిలోని సారం నీటిలో కరిగి పోవడమేకాక, వాటి మీది మలినాలు కూరల్లోకి చేరి చివరికి శరీరంలోకి చేరే ప్రమాదం వుంది.
  • పచ్చి కూరగాయలు ముఖ్యంగా.. దోసకాయలు, టమాటాలు, క్యారెట్లు, బీరకాయలు వంటివి ఉడకబెట్టకుండా బాగా ఆకడిగి నేరుగా తినటం ఎంతో మంచిది.
  • మార్కెట్ లో కొనేటప్పుడు వాడినవి, ఎండినవి గాక ముదురు రంగులో తాజా కూరగాయలను, పండ్లనే తీసుకోవాలి. వాడేముందు వాటిని శుభ్రంగా కడగాలి. అనుమానం ఉంటే కడిగి, ఆరబెట్టి వండుకోవడం ఉత్తమం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE