ఒక్కసారి మధుమేహ సమస్య మొదలయ్యాక ఆహార విషయంలో కీలకమైన మార్పులు ఎంతైనా అవసరం. అప్పుడే సమస్యను ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించవచ్చు. దీనివల్ల సమస్య తీవ్రత ముదరకుండా చూసుకోవటమే గాక మందులు వాడుతూ మిగిలిన జీవితమంతా పూర్తి ఆరోగ్యంగా గడపొచ్చు. అందుకోసం పాటించాల్సిన ఆరోగ్య నియమాలు... 

 • మధుమేహుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అధిక కేలరీలు, తక్కువ పీచు ఉండే ధాన్యాలు, నూనెగింజలు, చక్కెర వంటివి తగ్గించి పీచు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
 • మధుమేహుల భోజనంలో పండ్లు, కూరగాయల సలాడ్ తప్పనిసరి.
 • వీరు సులభంగా , నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా, తక్కువగా విడుదల అవుతుంది.
 • అన్నం మానేసి అతిగా చపాతీలు తిన్నమాత్రాన సమస్య రాదనుకొంటే అపోహేనని గుర్తించాలి. అన్నం ఇష్టపడే వారు అందులో బొబ్బర్లు, శెనగలు, పెసల వంటి గింజలు వేసి వండుకొని తింటే మంచిది.
 • భోజనానికి భోజనానికీ మధ్య పండ్లు తీసుకోవడం మంచిది. భోజనంలో పండ్లు తీసుకొనేవారు జామ, బొప్పాయి, పుచ్చ వంటివి తీసుకోవాలి.
 • మెంతులు తీసుకోవడం వల్ల ఆహారం నుంచి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియ వేగం తగ్గుతుంది. కనుక మధుమేహులు ఆహారం తీసుకునే ముందు చెంచా మెంతి పొడిని నీటితో కలిపి తీసుకుంటే మంచిది.

మేలైన డైట్ ప్లాన్

 • ఉదయం అల్పాహారంగా 2 ఇడ్లీలు, 1 కప్పు సాంబార్, 1 ఉడికించిన కోడి గుడ్డు, ఒక జామ కాయ తీసుకోవాలి. మళ్ళీ 11 గంటల వేళ గ్లాస్ మజ్జిగ, 4, 5 జీడిపప్పులు తీసుకోవాలి.
 • మధ్యాహ్నం ఒంటి గంటకు మెంతి లేదా మిరియాల పొడి, ఉప్పు చల్లిన సలాడ్, గింజలు కలిపి వండిన అన్నం, పప్పు, ఆకుకూర, మజ్జిగ, ఒక ముక్క బొప్పాయి పండు తీసుకోవాలి.
 • సాయంత్రం 4 గంటలకు గుప్పెడు మొలకెత్తిన గింజలు లేదా స్వీట్ కార్న్, వెజ్ సాండ్విచ్ తినాలి.
 • రాత్రి -8 గంటలకు రాత్రి భోజనం ముగించాలి. అందులో 2 ఫుల్కాలు, వెజ్ సలాడ్, ఆలు, శనగల కూర, గ్లాస్ మజ్జిగ, ఒక పండు చాలు.
 • నిద్రకు ముందుగా ఒక కప్పు పాలు, రెండు వాల్‌నట్స్‌ తీసుకోవచ్చు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE