శీతాకాలంలో తగినంత మంచి నీరు తాగే అలవాటు తప్పటం సహజమే. దీనివల్ల జీవక్రియల నిర్వహణ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యను నివారించాలంటే చలికాలం తీసుకొనే ఆహారంలో సలాడ్ ను చేర్చుకోవాల్సిందే. దీనివల్ల మేలైన పోషకాలతో బాటు శరీరానికి తగినంత నీరు కూడా అందుతుంది. సలాడ్ మూలంగా చర్మం పొడిబారటం వంటి సమస్యలు దూరమై చర్మం కొత్త కాంతిని సంతరించుకొంటుంది. అందుకే ఈ రోజు మంచి రుచి, పోషకాల సమాహారమైన పైనాపిల్‌ కీర సలాడ్‌ చేసుకు తిందాం.

కావలసినవి

పైనాపిల్‌ ముక్కలు -1 కప్పు, కీరా తరుగు - 1 కప్పు, చెర్రీ టొమాటోలు -6 (సగానికి కోయాలి), లెట్టూస్‌ తరుగు- అరకప్పు, కొత్తిమీర తరుగు - 2 చెంచాలు, నిమ్మరసం - 2 చెంచాలు, తేనె - చెంచా, శెనగపప్పు - చెంచా (నేరుగా వేయించి పలుకులుగా చేయాలి), ఉప్పు, నల్ల మిరియాల పొడి- రుచికి తగినంత.

తయారీ

 వెడల్పాటి గిన్నెలో నిమ్మరసం, తేనె, శెనగపప్పు పొడి, ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ పొడి వేసి కలిపి అందులో పైనాపిల్‌, కీరా, చెర్రీ టొమాటో ముక్కలు, లెట్టూస్‌ ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ సలాడ్‌ని అప్పటికప్పుడు తింటే రుచిగా ఉంటుంది. 

కేలరీ కౌంట్

ప్రొటీన్‌- 2.4 గ్రా

కొవ్వు- 0.3 గ్రా

కొలెస్ట్రా‌ల్‌- 13.5 గ్రా

విటమిన్‌ ఎ - 409.1 మై. గ్రా

విటమిన్‌ సి - 35.4 మి. గ్రా

కాల్షియం - 51.5 మి. గ్రా

ఐరన్‌ - 2.2 మి. గ్రా

ఫోలిక్‌ యాసిడ్‌ - 21.3 మై. గ్రా

ఫైబర్‌ - 1.0 గ్రాRecent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE