మన ఆరోగ్య సమస్యలకు పోషకాహార లోపం ప్రధాన కారణమనేది నిపుణుల మాట. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల్లో ఇది మరింత వాస్తవమని ఘనాకాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఒక్కోసారి తగిన ఆహార ఉత్పత్తులున్నా, వాటి పోషక విలువల గురించి తగిన అవగాహన లేకపోవటంతో వాటి ప్రయోజనాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇలాంటి ఉత్పత్తుల్లో సోయాబీన్‌ ప్రధానమైనది. సం పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించిన సోయా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి గొప్ప వరం వంటిది. సోయా అందించే అరోగ్యపరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సోయా ప్రత్యేకతలు

  • ప్రొటీన్ల పరంగా సోయా మాంసంతో సమానం. సోయా పిండి, సోయాపాలు, కాటేజ్‌చీస్‌ లాంటి ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొంటే తగినంత ప్రొటీన్ అందినట్లే.
  • సోయా ప్రోటీన్లలో తక్కువ కొవ్వు ఉండడం వల్ల రక్త నాళాలలో కొవ్వు చేరటం వంటి గుండె జబ్బుల బెడద లేదు. హృదయానికి మేలు చేసే ఆహారాల్లో ఇదీ ఒకటని పలు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి.
  • పెద్దపేగు ఆరోగ్యానికి సోయా ఉత్పత్తులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును పెంచేందుకు, అన్నవాహిక ఆరోగ్యానికి ఈ ఉత్పత్తులు ఎంతో దోహదం చేస్తాయి.
  • సోయా ఉత్పత్తుల్లోని ఫైటో ఈస్ట్రోజెన్ కాల్షియాన్ని పెరిగేలా చేసి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
  • ఆరోగ్యకరమైన పీచు అధికంగా ఉండే సోయా ఉత్పత్తులు తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోస్‌ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మధుమేహ సమస్య అదుపులోకి వస్తుంది.
  • రుతుక్రమం సమయంలో మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గి మహిళలు నిద్రలేమి, మానసిక ఆందోళన, చీకాకు వంటి సమస్యల బారిన పడతారు. సోయా ఉత్పత్తులతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.
  • సోయా పదార్థాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. సోయా ఉత్పత్తులు వాడటం ద్వారా కిడ్నీ రాళ్ల వంటి సమస్యలు తలెత్తవు.
  • సోయాలోని 'ఐసోప్లవనాయిడ్స్‌' ఫైటో ఈస్ట్రోజన్లుగా పనిచేస్తాయి. ఇవి ఈస్ట్రోజన్ల ప్రభావాన్ని అదుపుచేసి క్యాన్సర్ కణుతుల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. అలాగే కణాల సంఖ్య పెరగకుండా చేస్తాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE