క్రిస్మస్ సందర్భంగా బంధుమిత్రులకు కేకులు ఇచ్చుపుచ్చుకోవటం సహజమే. అయితే.. ఎప్పటి మాదిరిగా బయట కొన్న కేకులు బదులుగా ఇంట్లోనే చేసిన కేకులు అందిస్తే బాగుండనుకొనే వారికోసమే ఈ కేక్. ఈ కేక్ తయారీలో 2 దశలున్నాయి. ముందుగా బేస్, ఆ తర్వాత డెకరేట్ చేసుకోవాలి. 

బేస్ కోసం.. కావలసినవి

 చక్కెర పొడి- 200 గ్రా, గుడ్లు - 8, మైదా- పావుకిలో, కేక్‌జెల్ - 10గ్రా, నూనె- 25 మి.లీ, నీళ్లు - 5 మి.లీ, మ్యాంగో ఎసెన్స్ - 3 చుక్కలు, వెన్న- చెంచా

తయారీ

వెడల్పాటి పాత్రలో గుడ్ల సొన, చక్కెర పొడి, నీరు కలిపి బీటర్ సాయంతో బాగా కలిసేలా గిలకొట్టి అందులో మైదా, కేక్‌జెల్, నూనె కలపాలి. మైదా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎంత ఎక్కువ సేపు కలిపితే కేక్ అంత మెత్తగా వస్తుంది. అడుగున వెన్న పూసిన కేక్ మౌల్డ్ లో ఈ మిశ్రమాన్ని తీసుకుని ఓవెన్‌లో 180- 200  డిగ్రీల వద్ద 40 నిముషాలు బేక్ చేసి తీసేయాలి. 

డెకొరేషన్ క్రీమ్‌ కోసం

ఒక వెడల్పాటి గిన్నెలో పావుకిలో తాజా క్రీమ్, 50 గ్రాముల చక్కెర పొడి తీసుకొని బాగా కలపాలి. ఈ క్రీమ్ ను మీరు కోరిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE