క్రిస్మస్ వేళ సులభంగా చేసుకోదగిన కేకుల్లో ఇదొకటి. ప్రత్యేకమైన రుచి, మంచి పోషకాల వాల్ నట్ కేకు తయారీ ఎలాగో చూద్దాం.

కావలసినవి

వాల్‌నట్ పలుకులు - 25గ్రా, మైదా- పావుకిలో, గుడ్లు- 6,చక్కెర పొడి- 200 గ్రా, బటర్ -పావుకిలో, బేకింగ్ సోడా - 2 గ్రా.

తయారి

ముందుగా ఒక గిన్నెలోకి చక్కెర పొడి, గుడ్ల సొన వేసి బాగా బీట్ చేసి తరవాత అందులో మైదాపిండి, బటర్, వాల్‌నట్ పలుకులు, బేకింగ్‌సోడా వేసి 10 నిమిషాల పాటు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ రాసిన మౌల్డ్ లోపల ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరచి ఓవెన్‌లో 180- 200 డిగ్రీల వద్ద 40 నిముషాల పాటు బేక్ చేసి బయటకు తీసి నచ్చిన క్రీమ్‌తో కోరినట్లు అలంకరించుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE