మనం కప్పు కేకులుగా చెప్పేవే.. మఫిన్స్. ఎంతో మృదువుగా, మంచి సువాసనతో, మేలైన రుచితో అలరించే మఫిన్స్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో చేసిన మఫిన్స్ ను బంధుమిత్రులకు పంచుకొని వేడుక చేద్దాం. 

కావలసినవి

మైదాపిండి - పావుకిలో, చక్కెర పొడి - 200 గ్రా, డాల్డా- పావుకిలో, గుడ్లు - 5, కోకోపౌడర్ - 25 గ్రా, బేకింగ్ సోడా- 2 గ్రా, చాకొలేట్ చిప్స్ - 25 గ్రా, చాకొలేట్ టీ టైమ్ మిక్స్ - 25 గ్రా, బట్టర్- 1 చెంచా 

తయారీ

ఒక గిన్నెలో గుడ్ల సొన కార్చి అందులో కొద్దికొద్దిగా చక్కెర పొడి కలిపి గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ కలిపి కాసేపు బాగా గిలకొట్టాలి. బటర్ పూసిన గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి ఓవెన్‌లో 160- 180 డిగ్రీల వద్ద సుమారు 20 నిముషాలు బేక్ చేసి తీశాక ఆరిన తర్వాత జీడిపప్పు, చెర్రీ పలుకులతో కోరిన రీతిగా అలంకరించి తింటే చాలా బావుంటాయి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE