బెంగాలీ మిఠాయిలు ఇష్టపడేవారికి కాలాజామూన్‌ పేరు వినగానే తప్పక నోరూరుతుంది. రసగుల్లా, గులాబ్ జామూన్ లతోపోటీ పడదగిన వంటకమిది. అదెలా చేయాలో తెలుసుకుందాం.

కావల్సినవి

 గులాబ్‌జామూన్‌ పొడి - 2 కప్పులు, పాలు - పావుకప్పు, యాలకులపొడి - చెంచా, ఆకుపచ్చ రంగు - చిటికెడు, చక్కెర - గరిటెడు , నూనె - వేయించేందుకు సరిపడా.

పాకం కోసం: చక్కెర, నీళ్లు - 2 కప్పుల చొప్పున, చక్కెరపొడి - అరకప్పు. 

తయారీ

 గులాబ్‌జామూన్‌పొడీ, పాలు ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. ఇందులోంచి పావు ముద్దను విడిగా తీసి ఆకుపచ్చ రంగూ, చక్కెర, యాలకులపొడి వేసి బాగా కలుపుకోవాలి. మొదట కలిపిన పిండినీ, ఆకుపచ్చ రంగు ఉన్న ముద్దనూ చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. మొదట తెలుపురంగు ఉండను తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకోవాలి. అందులో ఆకుపచ్చ రంగు ఉండను ఉంచి.. అంచులు మూసి ఉండలా చేసుకోవాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఉండల్ని రెండేసిచొప్పున కాగుతోన్న నూనెలో వేసి కాస్త నల్లగా అయ్యేవరకూ వేయించుకొని పక్కన బెట్టుకోవాలి. ఈ లోపు చక్కెర, నీళ్లూ ఓ గిన్నెలోకి తీసుకుని తీగపాకం పట్టి దింపేయాలి. వేడి కాస్త చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న ఉండల్ని పాకంలో వేసి కాసేపయ్యాక తీయాలి. వాటిపై చక్కెరపొడి చల్లి నేరుగా వడ్డించుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE