పెద్ద పండుగనాడు సంప్రదాయ వంటకాలతో బాటు సరికొత్త వంటకాలు చేయాలనుకొనే వారికి గులాబీ గుత్తులు చేసుకోవచ్చు. ఈ పండుగ వేళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఏ వంటకాన్ని మీరూ చేసి చూడండి.

కావలసినవి

బియ్యప్పిండి - ఒకటి ముప్పావు కప్పులు, మైదా - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, నెయ్యి - గరిటెడు, యాలకులపొడి - అర చెంచా, నూనె - వేయించడానికి తగినంత

తయారి

నూనె కాకుండా మిగతా పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో పోసి బాగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ దోసెలపిండిలా జారుగా కలిపి పదినిముషాలు నానబెట్టాలి. వేయించడానికి సరిపడేంత నూనె బాణలిలో పోయాలి. గులాబిపువ్వుల అచ్చును నూనెతో పాటు కాగనివ్వాలి. నూనె కాగిన తరవాత, అచ్చును బయటకు తీసి పిండి మిశ్రమంలో ముప్పావు వంతు భాగం ముంచాలి. (పూర్తిగా ముంచితే గులాబిగుత్తులు ఊడిరావు). పిండి నుంచి అచ్చును తీసి కాగుతున్న నూనెలో అరనిముషం సేపు ఉంచి కొద్దిగా కదిలిస్తే అచ్చు నుండి పువ్వు బయటికి వచ్చేస్తుంది. రాకపోతే ఫోర్క్‌తో కొద్దిగా కదిలించాలి. ఈ పువ్వును రెండువైపులా దోరగా వేయించి తీసేయాలి. (ఇద్దరు ఉంటే చేయటం తేలిక.)Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE