కొరికేందుకు మెత్తగా.. అంతమాత్రాన ... రుచికి గట్టిది కాదు. విశేషించి మాంసాహార వంటకాల సరసన చిట్టిగారె లేకుంటే గొప్ప వెలితే. పెద్ద పండగ వేళ చిట్టిగారెల కమ్మని రుచిని ఆస్వాదించాలనుకొంటున్నారా? అయితే.. ఇంకెందుకాలస్యం? మొదలుపెట్టేద్దాం.  

కావలసినవి

మినప్పప్పు - అరకప్పు, బియ్యప్పిండి - 2 కప్పులు, వాము - అర చెంచా, ఉప్పు, కారం - తగినంత, నూనె - వేయించడానికి సరిపడినంత

తయారి

మినప్పప్పుని 2 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో బియ్యప్పిండి, వాము, ఉప్పు, కారం వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కుంకుడుకాయ పరిమాణంలో చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక తడి బట్ట మీద ఈ ఉండలను దూరందూరంగా పెట్టి, మరో తడిబట్టతో కప్పేయాలి. చెంబుతో కాని ఏదైనా బరువైన వస్తువుతో గాని ఈ ఉండల మీద గట్టిగా అదమాలి. దీని వలన ఉండలు గుండ్రంగా, పలుచగా వస్తాయి. వీటిని జాగ్రత్తగా తీసి కాగుతున్న నూనెలో వేయించాలి. (బట్ట తడిగా ఉండేలా జాగ్రత్తపడాలి. లేకపోతే పిండి... బట్టకు అతుక్కుపోయి సరిగ్గా ఊడిరావు). కావాలనుకొంటే పిండిలో కాసిని నానబెట్టిన పచ్చిశెనగపప్పు కూడా కలుపుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE