సంక్రాంతి వేళ చేసే తీపి వంటకాల్లో బెల్లం గవ్వలు ముందువరుసలో ఉంటాయి. వీటిని తక్కువ సమయంలో  సులభంగా చేసుకోవచ్చు. బెల్లంతో చేస్తారు గనుక ఆరోగ్యానికీ ఎంతో మంచిది. మధుమేహులూ వీటిని తినొచ్చు. వీటి తయారీ ఎలాగో తెలుసుకొందాం. 

కావలసినవి

మైదా లేదా గోధుమపిండి - కప్పు, బొంబాయిరవ్వ - టేబుల్ స్పూను, బెల్లం తురుము - అర కప్పు, నెయ్యి - టేబుల్ స్పూను, నూనె - వేయించడానికి సరిపడేంత

తయారి

ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాత నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనిని అరగంటసేపు నాననివ్వాలి. నానిన ముద్దను చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి ముదురుపాకం వచ్చాక, వేయించిన గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి.

 Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE