ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు తెలిసిందే. రోజుకో యాపిల్ తింటే వైద్యుడితో పనే లేదనే సంగతి తెలియని వారుండరు. పోషకాలపరంగా మేలైన కొబ్బరీ అంతే. ఇక.. ఈ రెంటినీ కలిపి చేసే హల్వామంచి రుచి, తగినన్ని పోషకాలనూ అందిస్తుంది. బడిపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. 

కావలసినవి

చక్కెర, చిక్కనిపాలు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు చొప్పున, యాపిల్‌ - ఒకటి, డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - గుప్పెడు, నెయ్యి - 2 చెంచాలు,యాలకుల పొడి - అరచెంచా 

చేసే పద్ధతి

మందపాటి అడుగున్న గిన్నెలో పాలు, చక్కెర, యాపిల్‌ తురుము వేసి కలిపి ఆ గిన్నెను స్టౌ మీద పెట్టి సన్నని సెగ మీద 10 నిమిషాలు ఉడికించాలి. ఆ మిశ్రమం చిక్కబడేటప్పుడు డ్రైఫ్రూట్స్‌ పలుకులు, చెంచా నెయ్యి కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరోసారి కలిపి మరో చెంచా నెయ్యి కలిపి 5 నిమిషాలు ఉడికించుకొంటే వేడివేడి రుచికరమైన హల్వా రెడీ. కావాలనుకునేవారు  దీన్ని ముక్కలుగా కోసుకొని చివరలో మరికొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లి ఆరిన తర్వాత తినొచ్చు. రంగు కోసం కొద్దిగా ఫుడ్‌ కలర్‌ కలుపుకోవచ్చు.

 

 Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE