డ్రై ఫ్రూట్స్ లో అత్యంత చౌకైనది, పోషకాలపరంగా విలువైనది.. ఖర్జూరం. ఆరోగ్యప్రదాయినిగా పేరున్న ఖర్జూరం అత్యంత పురాతన కాలం నుంచీ వినియోగంలో ఉంది. కొలెస్ట్రాల్‌, కొవ్వు అసలే ఉందని ఫలాల్లో ఇదీ ఒకటి గనుక అందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పైగా తీసుకొన్న నిమిషాల వ్యవధిలోనే శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.ఈ ఎడారి ఫలం అందించే మరిన్ని ప్రయోజనాలివే.

 • ఖర్జూరంలోని పొటాషియం మెదడు పనితీరును పెంచుతుంది. వృద్ధుల్లో ఈ మార్పు మరింతగా కనిపిస్తుంది.
 • ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు (100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మి.గ్రా. ఐరన్ ఉంటుంది) తినే గర్భిణులకు, రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా వున్న బాలికలు, మహిళలకూ రక్తహీనత సమస్య రాదు.
 • ఖరూరం తినే గర్భిణుల్లో కాన్పు సమయంలో గర్భాశయ కండరాలు వ్యాకోచించి కాన్పు సులభంగా జరగటమే గాక తగినన్ని చనుబాలు పడతాయి. అలసట, నీరసం కూడా దూరమవుతాయి.
 • రోజుకో ఖర్జూరపండు తింటే ఇందులోని విటమిన్‌ ఏ మూలంగా రేచీకటి వంటి నేత్ర సమస్యలు రావు.
 • వారానికి కనీసం 3 లేదా 4 ఖర్జూరాలు తినేవారికి మలబద్ధకం బెడద ఉండదు.
 • గుండె సమస్యలున్నవారు రాత్రి నీటిలో నానబెట్టిన ఖర్జూరాన్ని మెత్తగా నూరి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
 • పురుషుల్లో లైంగిక, సంతానలేమి సమస్యలకు ఖర్జూరం వినియోగం ఎంతో మేలు చేస్తుంది. రాత్రిమేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నేరుబ్బి తేనె, యాలకుల పొడి, జోడించి తింటే లైంగికపటుత్వం కూడా పెరుగుతుంది.
 • తరచూ నీళ్ల విరేచనాలతో బాధపడేవారు ఖర్జూరం తింటే అందులోని పొటాషియం వల్ల సమస్య దారికొస్తుంది.
 • ఖర్జూరాల్లో సల్ఫర్‌ అలర్జీ, సైనస్‌ బాధితులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 • బరువు తక్కువగా ఉండేవారు రోజూ 2 ఖర్జూరాలు తింటే బరువు పెరుగుతారు.
 • రోజూ ఖర్జూరాలను తినడం వల్ల దంతాల మీద పాచి చేరదు. దీనివల్ల ఎనామిల్‌ దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
 • ఖర్జూరంలోని సెలీనియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఎముకపుష్టిని కలిగిస్తాయి. ముఖ్యంగా వృద్దాప్యంలో ఆస్టియోపొరోసిస్‌ రాకుండా చేస్తాయి.
 • ఖర్జూరాల్లోని నికోటిన్‌ పేగు వ్యాధులను నివారిస్తుంది. వీటిలోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి.
 • ఖర్జూరంలోని 'పెక్టిన్' అనే రసాయనం రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్‌ను అదుపు చేస్తుంది.
 • తరచూ ఖర్జూరాలు తినేవారికి పొత్తికడుపు క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE