మంచి రుచి, మేలైన పోషకాలను అందించే రాగిలడ్డు పిల్లలకు అత్యుత్తమ చిరుతిండి. ఎదిగే వయసు పిల్లలకు కావలసిన శక్తిని అందించటంలో ఇదెంతో ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో, సులభంగా చేసే ఈ రాగిలడ్డూను ఈ రోజే మీ పిల్లలకు చేసి పెట్టండి. 

తయారీకి కావలసినవి

రాగిపిండి- 1 కప్పు, బెల్లం తురుము- 1 కప్పు, పల్లీలు- 1 కప్పు, నెయ్యి- 1 కప్పు, జీడిపప్పు: 10, నువ్వులు-1 కప్పు, బాదం పప్పు- గుప్పెడు, యాలకుల పొడి- పావు చెంచా, ఎండు ద్రాక్ష- 8 

తయారీ

ముందుగా పొయ్యిమీద మూకుడు పెట్టి వేటికవే పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పక్కన ఒక్కో గిన్నెలో పెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమానికి వేయించి పెట్టుకున్న రాగిపిండి, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇందులోనే మరికొన్ని జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్ష కూడా వేసి కొద్దికొద్దిగా కాచిన తాజా నెయ్యి కలుపుకొని లడ్డుగా కట్టుకోవాలి. రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE