ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకం. అలాంటి మేలైన ఆహారాల్లో స్వీట్ కార్న్ (తీపి మొక్కజొన్న) ముఖ్యమైనది. తరచూ స్వీట్ కార్న్ తినేవారికి ఎన్నో అరుదైన పోషకాలతో బాటు తగినంత శక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్ కార్న్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకొందాం.

 • స్వీట్ కార్న్ లో విరివిగా లభించే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తాయి.
 • రోజూ గుప్పెడు స్వీట్ కార్న్ తింటే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ శరీరానికి అంది గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలూ అదుపులో ఉంటాయి.
 • స్వీట్ కార్న్ లో స్టార్చ్ కంటే చక్కెర అధికంగా ఉంటుంది గనుక త్వరగా బరువు పెరగడానికి దోహదపడుతుంది. కనుక ఇది తక్కువ బరువున్న పిల్లలకు ఇదెంతో మేలుచేసే ఆహారం.
 • స్వీట్ కార్న్ ఫాస్పరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం వంటి ఎన్నో కీలక ధాతువుల సమాహారం. వీటిలో ఫాస్పరస్ ఎముకల, కిడ్నీ ఆరోగ్యానికి, మెగ్నీషియం గుండె కొట్టుకొనే వేగాన్ని క్రమంగా ఉండేలా చేసేందుకు, విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనత నివారణకు దోహదపడతాయి.
 • స్వీట్ కార్న్ లో అత్యధికంగా లభించే పీచు, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు కొలెస్ట్రాల్ ను అదుపు చేసి గుండెజబ్బుల ముప్పును తగ్గించటమే గాక రక్తప్రసరణ కూడా మెరుగుపడేలా చేస్తాయి.
 • 100 గ్రాముల బేబీకార్న్ తింటే 342క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే విటమిన్ బి, నియాసిన్ మరియు థైమిన్ లు కూడా లభిస్తాయి.
 • బీటాకెరోటిన్స్ కారణంగా పసుపురంగులో కనిపించే స్వీట్ కార్న్ తిన్నప్పుడు ఆ బీటాకెరోటిన్స్ విటమిన్ ఎ రూపంలో అంది కంటి చూపు మెరుగుపడటమే గాక చర్మం తాజాగా కనిపిస్తుంది.
 • రోజూ పరిమితంగా స్వీట్ కార్న్ తినే వారికి అందులోని ఫైటోకెమికల్స్ కారణంగా మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. దీన్ని మధుమేహులు తీసుకొంటే సమస్య అదుపులో ఉంటుంది.
 • స్వీట్ కార్న్ లోని ఫినోలిక్ ఫైటోకెమికల్స్ హైపర్ టెన్షన్ ను అదుపు చేసి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
 • స్వీట్ కార్న్ లో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి, తగినన్ని ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేయటమే గాక కీళ్ల నొప్పులను కూడా రాకుండా చేస్తాయి.
 • గర్భిణులు తరచూ స్వీట్ కార్న్ తినటం వల్ల తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. దీనివల్ల వారి, బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణుల్లో కాళ్ళు చేతుల వాపు లక్షణాలూ తగ్గుతాయి.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE