ఎన్నో పోషకాలున్న, చౌకైన ఆకుకూర క్యాబేజీ. రోజువారీ దీన్ని రోజువారీ ఆహారంలో ఎంత తీసుకొంటే అంత మంచిది. అయితే క్యాబేజీ కోసినప్పుడు వచ్చే విభిన్నమైన వాసన కారణంగా చాలామంది దాన్ని తినేందుకు ఇష్టపడరు. అయితే దాన్ని పచ్చడి రూపంలో వడ్డిస్తే వీరు కూడా లొట్టలేసుకొంటూ తినాల్సిందే. మరి..క్యాబేజీ పచ్చడిఎలా చేయాలో తెలుసుకొందాం. 

కావలసినవి : క్యాబేజీ- 400 గ్రాములు( తురుముకోవాలి), వేరుసెనగ పప్పు- పావు కప్పు, ఎండు మిర్చి-3, మినపపప్పు- 1 చెంచా, సెనగపప్పు- 1 చెంచా, ఇంగువ- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- 4 చెంచాలు, ఆవాలు- చెంచా, కరివేపాకు- 2 రెబ్బలు 

తయారీ : రెండు చెంచాల నూనెని వేడిచేసి అందులో వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేగాక అందులోక్యాబేజీ తురుము వేసి రంగు మారే వరకు వేయించి పక్కనబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.అవసరాన్ని బట్టి 2 చెంచాల నీరు పోసి రుబ్బుకోవచ్చు. ఇప్పుడు మరో మూకుడులో 2 చెంచాల నూనె వేసి వేడికాగానే ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించి రుబ్బిన మిశ్రమాన్ని ఈ పోపులో పోసి చివరగా ఉప్పు కలుపుకొంటే రుచికరమైన పచ్చడి సిద్దమైనట్లే. ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి కూడా చాలా బాగుంటుంది.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE