తెలుగువారి తొలిపండుగ ఉగాది రానే వచ్చింది. కోయిలమ్మ కుహూరావాలు, వేపపువ్వు సువాసనలు, వగరు మామిడిపిందెలను వగరు రుచులతో బాటు ఈసారి వస్తూనే చిరు జల్లులనూ ఉగాది వెంటబెట్టుకొచ్చింది. ఇక షడ్రుచుల పచ్చడితోబాటు కొంగొత్త రుచులనూ అందించనుంది.ఈ ఉగాది రోజు ఘుమఘుమలాడే గారెలు చేయటం ఎలాగో తెలుసుకొందాం. 

కావలసినవి

మినపప్పు- అరకిలో, పచ్చిమిర్చి- 6, ఉప్పు- రుచికి తగినంత, జీలకర్ర- చెంచా, అల్లం - అర అంగుళం ముక్క, నూనె - వేయించటానికి సరిపడా,

తయారీ

మినపప్పుని 4 గంటల ముందు కడిగి నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నీరు పూర్తిగా వార్చి అతి తక్కువ నీటిని చల్లుతూ రుబ్బుకోవాలి. పప్పు నలుగుతున్నప్పుడు దానికి పచ్చిమిర్చి అల్లం కలుపుకోవాలి. రుబ్బిన పిండిలో ఉప్పు, జీలకర్ర కలుపుకుని ఒక కవరు మీద గారెలు చేసుకొని కాగిన నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన గారెలు కొబ్బరి పచ్చడితో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE