ఎప్పుడూ శివరాత్రి వరకూ ఉండే చలి ఈ ఏడాది కాస్త ముందుగానే పోయి భానుడి ప్రతాపం మొదలయ్యింది.  మండే ఎండలు, వేధించే ఉక్కపోత ధాటికి జనం కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించాల్సిన సమయమిది. వీటితో పాటు వేసవి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మామిడి మొదలు పలు రకాల పండ్ల రసాలూ ఎంతగానో ఉపయోగపడతాయి. 

సహజంగా దొరికే పళ్ళలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. పళ్ళల్లో సహజంగా ఉండే చక్కెర శరీరానికి శక్తినిస్తుంది. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలను, మాలిన్యాలను పండ్లు బయటికి పంపుతాయి. అందుకే రోజూ ఏదో ఒక పండు తినే అలవాటు చేసుకోవాలి. పిల్లలకూ ఈ అలవాటు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో దొరికే సపోటా, పుచ్చకాయ, మామిడి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.  
మామిడి : పళ్ళల్లో రాజయిన మామిడి సీజన్‌ వచ్చేసింది. ప్రస్తుతం అతి కొన్ని చోట్ల మాత్రమే ఇది లభ్యమవుతున్నప్పటికీ తొందరలో మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఈ మామిడికాయకు సంబంధించి పనికి రానివి అంటూ ఏమీ లేవు. ఆహారంగా మామిడి కాయలు, పండు వుపయోగపడతాయి. ఔషధాలలో మామిడి టెంకలోపలి జీడినీ, చెట్టు బెరడునీ కూడా వుపయోగిస్తు న్నారు. ఇందులో పోషకవిలువలూ ఎక్కువే. కాల్షియం 14 మి. గ్రా. ప్రొటీన్లు 0.6 శాతం, విటమిన్‌ ‘సి’. 16 మి.గ్రా. ఇనుము 1.3 మి.గ్రా.పిం డి పదార్థాలు 16.9 శాతం వుంటాయి. పండులో కంటే, పచ్చికాయలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. పండిన మామిడిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సన్నగా ఉన్నవారు లావెక్కడానికి సహాయపడతాయి.

ఉపయోగాలు
జీర్ణశక్తిని పెంచుతుంది. మామిడికాయ ముక్కలలో తేనె, మిరియాలు చేర్చి తింటే జీర్ణకోశ సంబంధమయిన ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ కలుగుతుంది. ఉప్పుచేర్చిన మామిడికాయ ముక్కలు తినడం వలన వేసవిలో చెమట వలన కలిగే అలసట తగ్గుతుంది. వికారాన్ని తగ్గిస్తుంది.  నోట్లో నీరు ఊరి వికారంతో బాధపడేవారు మామిడికాయ ముక్కలు తినడం మంచిది. మామిడి పళ్ళల్లో మిటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. మామిడిపళ్ళు తినడం వలన కంటి చూపుకి అవసరమయిన విటమి న్‌ ‘ఎ’ లభస్తుంది. కంటి సంబంధమయిన అనేక వ్యాధులు రాకుండా రక్షణ కలుగుతుంది. మామిడి పండు తిని, పాలు తాగుతే బరు వు కూడా పెరుగుతారు. సన్నగా ఉన్నవారికి ఇది ఆనందకరమయిన విషయం కూడా. 

యాపిల్ : ఏ పండయినా తినం అనేవాళ్ళు ఉంటారు గానీ యాపిల్‌ వద్దనేవారు మాత్రం ఉండరు.యాపిల్‌ తొక్క తీయకుండా తినాలి.  ఈ తొక్కలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. 84.6 శాతం తేమ,0.2శాతం ప్రొటీన్లు,10 మి.గ్రా కాల్షియం, విటమిన్‌ ఎ ఉంటాయి. 

ఉపయోగాలు : ఇందులోని పెక్టిన్‌ అనే పదార్థం, జీర్ణమండలంలో వ్యర్థ పదార్థాలూ, విషపదార్థాలూ పేరుకుపోకుండా రక్షిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే యాపిల్‌ని ఖాళీ కడుపుతో ఉండగా తినకూడదు. అలా తింటే జీర్ణం కాదు. గుండె జబ్బు ఉన్నవారు నిరభ్యంతరంగా తినదగిన పండు. ఇందులో ఉండే పొటాషియం గుండెజబ్బు బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దంతాల ఆరోగ్యానికీ మంచిదే. రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా తినొచ్చు. ఇందులో సోడియం లేదు, బి.పి. అధికంగా ఉన్నవారికి అవసరమయిన పొటాషియం కావలసినంత ఉంది.

అనాస : అనేక పోషక విలువల, ఆరోగ్యకర గుణాలూ, ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న మరో పండు అనాస. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా రక్షణ ఇస్తుంది. నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. అనస ఆకులకి కూడా ఔషదగణాలు ఉన్నాయి. 12 మి.గ్రా విటమిన్‌ సి, 160 మైక్రో మి.గ్రా పొటాషియం , 89శాతం తేమ, 1 గ్రా పిండిపదార్థాలు,0.2శాతం కొవ్వు వున్నాయి. 

ఉపయోగాలు : పండిన అనాస తింటూంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలుగుతుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు పోతాయి. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్‌ కారకమయిన పదార్థాలు తయారు కాకుండానూ, పేరుకోకుండానూ రక్షణ ఇస్తాయి.


పుచ్చకాయ :వేసవి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. తీవ్రమైన ఎండల నుండి తట్టుకోవడానికి, దాహం నుంచి సేద తీరడానికి అనువుగా ప్రకృతి పుచ్చకాయలను ఇచ్చింది. బాగా పండిన పుచ్చకాయలో 60 శాతం పదార్థం తినడానికి వస్తుంది. 100 గ్రా పదార్థంలో 95 శాతం నీరు వుంటుంది. 15 క్యాలరీల శక్తి, విటమిన సి 17 మి.గ్రా, 32 గ్రా కాల్షియం వుంటుంది. గింజలలో 34 శాతం ప్రోటీనులు, 54 శాతం నూనెలు లభిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE