ఎండలు ముదురుతున్న ఈ సమయంలో పిల్లల ఆహారం విషయంలో పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికితోడు ఈ రోజుల్లో పరీక్షల ఒత్తిడి, ఎక్కువ సమయం మేలుకొని చదువుకోవటం  వంటి కారణాల వల్ల ఈ సీజన్లో శరీరం ఎక్కువగా అలసటకు లోనవుతుందని, అందుకే మిత భోజనంతోపాటు పండ్లు, పాలతో చేసిన పానీయాలు, నీరు తగినంతగా తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. ఎండలు అధికమవుతున్న ఈ సమయంలో పిల్లల ఆహారం విషయంలో నిపుణులు ఇస్తున్న కొన్ని సలహాలు.. 

  • ఎండల తీవ్రత పెరిగే రోజుల్లో పిల్లలు మాంసాహారం కంటే త్వరగా జీర్ణమయ్యే శాకాహారం తీసుకోవటం ఎంతో మంచిది. అలాగే వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. వాటి స్థానంలో కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. 
  • ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ రోజుల్లో పుచ్చకాయ, నారింజ, మామిడి, దోస, పైనాపిల్, ద్రాక్ష వంటి పండ్లు నేరుగా తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత నీరు అందుతుంది. దీనివల్ల పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. పండ్ల రసాలనూ తీసుకోవచ్చు . నిమ్మరసం, పుదీనా రసం, రాగి జావ, కొబ్బరినీరు వంటివి తీసుకొంటే దాహం తీరటంతో బాటు తగినన్ని పోషకాలూ అందుతాయి. 
  • వేడి అధికంగా ఉండే ఈ రోజుల్లో పిల్లలకు నేరుగా పాలు ఇవ్వటం కంటే లస్సీ, మిల్క్‌షేక్ రూపంలో ఇస్తే ఇష్టంగా తాగుతారు.అలాగే పెరుగు, మజ్జిగల రూపంలో ఇవ్వటం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. 
  • ఎండలు అధికమవుతున్న ఈ తరుణంలో పిల్లలకు చిప్స్, నూనెతో చేసిన చిరుతిళ్ళ కంటే ఇంట్లో చేసిన అల్పాహారాలు, గుగ్గిళ్ల వంటి సంప్రదాయ చిరుతిళ్ళు అందించాలి. 
  • వేసవిలో పిల్లల ఆహారంలో కారం, మసాలాలు బాగా తగ్గించాలి. రోజువారి ఆహారంలో పప్పు, సలాడ్ ఉండేలా చూసుకోవాలి.
  • ఒకేసారి కడుపునిండా ఆహారం పెట్టటానికి బదులుగా కొద్దీ మొత్తాలను ఎక్కువ దఫాలుగా అందించాలి.
  • ఐస్‌క్రీంలు, శీతల పానీయాలు అప్పటికి హాయినిచ్చినా కాసేపటికి దాహార్తిని పెంచుతాయి గనుక వాటికి పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే వాటి తయారీలో వాడే ఐస్, రంగులు, రసాయనాల వల్ల గొంతు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE