కమ్మని రుచి, బోలెడన్ని పోషకాల సమాహారమే సపోటా. తేలిగ్గా జీర్ణ‌మ‌వ‌డ‌మే గాక తగినంత శ‌క్తిని అందిస్తాయి గనుక అందరూ వీటిని ఎంతో ఇష్టపడతారు. ఇతర పండ్లతో పోల్చితే చౌక కూడా. ఈ సీజ‌న్‌లో సపోటా ఎక్కువ‌గా దొరుకుతుంది గనుక అందరూ రోజుకో రెండు పండ్లు తినటం మంచిది. సపోటా వినియోగం వాళ్ళ కలిగే ఆరోగ్య పరమైన ఉపయోగాలివే.

ఉపయోగాలు

  • ఆయుర్వేదం ప్రకారం సపోటా వినియోగం శరీరంలోని వేడిని తగ్గించి ఒంటిని చల్లబరుస్తుంది.
  • నీరసంగా ఉన్నప్పుడు సపోటా పండ్లను తింటే, శరీరం అతి తక్కువ సమయంలో శక్తిని పుంజుకుంటుంది. అయితే ఇందులో చక్కెర పాళ్ళు అధికం గనుక మధుమేహులు పరిమితంగానే తీసుకోవాలి.
  • సపోటాలో అధికంగా ఉండే 'విటమిన్ ఎ' కంటిచూపును మెరుగుపరచేందుకు దోహదం చేస్తుంది.
  • సపోటాలోని పీచు పదార్థం మంచి జీర్ణశక్తినిస్తుంది. పెద్దపేగు కేన్సర్‌ ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.
  • మొలలు, ఫిస్ట్యులా బాధితులు తరచూ సపోటా తింటే రక్తస్రావం తగ్గుతుంది. పేగులు బలపడతాయి.
  • మలబద్దకం బాధితులు రోజూ గ్లాసు సపోటా రసంలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే సుఖవిరేచనం అవుతుంది. అలాగే..ఆగకుండా విరేచనం అవుతున్నప్పుడు సపోటా తింటే విరేచనం అదుపు అవుతుంది.
  • సపోటా వినియోగంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. గాయాలు తక్కువ సమయంలో మానిపోతాయి.
  • మొలకెత్తిన రాగుల్ని ఎండబెట్టి పిండిబట్టి అందులో సపోటా గుజ్జు కలిపి సాయంత్రం వేళల్లో తింటే కాల్షియం లోపం తొలగిపోతుంది.
  • గర్భిణులు సపోటా తింటే తగినన్ని పోషకాలు అందినట్లే.
  • సపోటా రసంలో కొద్దిగా పాలు, చిటికెడు జాజికాయ, జాపత్రి, మరో చిటికెడు పచ్చకర్పూరం కలిపి రాత్రి పూత తాగితే సుఖనిద్ర సిద్ధిస్తుంది.
  • సపోటా వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ అనారోగ్యాల బెడద బాగా తగ్గుతుంది.
  • బిరుసైన, చిట్లిన జుట్టు మృదువుగా మారి బాగా పెరగాలంటే సపోటా తినాల్సిందే. అలాగే చుండ్రు, మొటిమలు, ముఖం జిడ్డు కారటం వంటి ఇబ్బందులకూ సపోటా వినియోగం మంచి ఔషధం.
  • సన్ ఎలర్జీ ఉన్నవారు ఎండలోకి వెళ్ళగానే చర్మం ఎర్రగా మరి దురదపెడుతుంది. వీరు రోజుకో రెండు సపోటా తింటే అందులోని విటమిన్ సి కారణంగా ఈ ఇబ్బంది దూరమవుతుంది.
  • తరచూ సపోటా తినేవారి మానసిక ఆరోగ్యం బావుంటుంది. డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన వంటివి దరిజేరవు.
  • వేడి చేసినప్పుడు కనిపించే పొడిదగ్గు, మూత్రంలో మంట, కడుపులో మంట, విరేచనంలో మంటకు సపోటా వినియోగం మంచి విరుగుడు.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE