భారతీయులు వాడే మసాలా దినుసుల్లో వెల్లుల్లి ఒకటి. ఇక.. మాంసాహార వంటకాల్లో ఇది లేనిది పనే జరగదు. వంటకాలకు కమ్మని రుచి, వాస‌న‌తో బాటు ఒంటికీ ఇదెంతో మేలు చేస్తుంది. దీనిలోని పలు ఔష‌ధ‌గుణాలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. రోజూ ఏది ఒక రూపంలో వెల్లుల్లి తినేవారికి కలిగే ప్రయోజనాలెన్నో అని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకొందాం. 

  • వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే భాస్వరం మూలంగా దీనికి ఘాటైన వాసన ఉంటుంది. ఈ భాస్వరం రక్తనాళాల్లో గార (ప్లాక్)ను కరిగించి పేరుకుపోకుండా చూస్తుంది. వెల్లుల్లిలోని ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
  • వెల్లుల్లిలోని 'ఆలిసిన్' అనే ప‌దార్థం యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్ల ముప్పును తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • వెల్లుల్లి తిన్నప్పుడు అందులోని పాలీ సల్ఫయిడ్స్ హైడ్రోజన్ సల్ఫయిడ్ వాయువుగా మారి రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటును అదుపు చేస్తాయి.
  • ఆస్తమా బాధితులు, తరచుగా జలుబు బారిన పడేవారు రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే మంచి ఫలితం కనబడుతుంది.
  • ఆహారంలోని ఐరన్‌ను శరీరం బాగా గ్రహించేలా దోహదపడే ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి వినియోగం ఈ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. త‌ద్వారా ర‌క్తహీన‌తను నివారిస్తుంది.
  • వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫయిడ్, థియోక్రెమోనోన్‌లు వాపు నివారకాలుగా పనిచేసి శ‌రీర వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.
  • వెల్లుల్లిలోని ఆలీల్ సల్ఫయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకూ తోడ్పడతాయి.
  • వెల్లుల్లి వినియోగంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • రోజూ వెల్లుల్లి తినేవారు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించగలుగుతారు. డిప్రెష‌న్ బాధితులు రోజూ వెల్లుల్లి తింటే దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE