రోజుకో ఆపిల్‌ తినేవారు వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని పెద్దలు చెబుతుంటారు. రష్యాలో పుట్టిన ఆపిల్ కాలక్రమంలో ప్రపంచమంతా ప్రయాణించింది. నేడు సుమారు 200 రకాలకు పైగా ఆపిల్ రకాలు ప్రపంచ వ్యాప్తంగా సాగులో ఉన్నాయి. బోలెడన్ని పోషకాలతో బాటు కొన్ని నెలల పాటు ఏమాత్రం పాడుకాకుండా ఉండటం వల్ల ఈ ఫలం ఎక్కువగా వినియోగంలోకి వచ్చింది.

   మన శరీరంలో వేలాది నాడులు పలు జీవక్రియల నిర్వహణలో చురుగ్గా పనిచేస్తుంటాయి. ఈ నాడుల పనితీరుకు అవసరమైనంత గ్లూటామిక్‌ ఆసిడ్‌ మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఆమ్లం నాడీ కణాల సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుతుంది. ఏదైనా కారణం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిస్త్రాణ, మతిమరుపు, అనాశక్తి, చికాకు, క్షణకోద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తరచూ ఆపిల్ తినటం ఎంతైనా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

 ఆపిల్‌లోని మిటమిన్‌ ఎ, సి, ఫాస్పరస్‌, పొటాషియంలతో బాటు ఖనిజ లవణాలు ఆరోగ్యానికి దోహదపడతాయి.  ఆపిల్ లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు అతి తక్కువగా ఉంటాయి గనుక ఆపిల్ అన్ని వయసుల వారికీ సులభంగా జీర్ణమవుతుంది.

వైద్య ఉపయోగాలు

    ఆపిల్‌ను ముక్కలుగా కోసి తినటానికి బదులు నేరుగా కొరుక్కొని తింటేనే మంచిది. తినటం శ్రేయస్కరం. దీనివల్ల దంతాలు, చిగుళ్ళు బలపడతాయి. దంతాల మీది ఎనామిల్‌ కూడా ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే ఆపిల్‌ను ప్రకృతి ప్రసాదిత టూత్‌బ్రష్‌ అంటారు. రోజుకో ఆపిల్ తింటే నోటి దుర్వాసన సమస్య రాదనీ, ఉన్నా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆపిల్ వినియోగం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీనివల్ల హృద్రోగాల ముప్పు దూరమవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది.

100 గ్రాముల ఆపిల్‌లో...

పిండి పదార్థాలు      13.4 గ్రా

 క్రొవ్వు                0.1 గ్రా

మాంసకృత్తులు      0.3 గ్రా

కాల్షియం              10 మి.గ్రా

భాస్వరం               20 మి.గ్రా

మెగ్నీషియం          7 మి.గ్రా

ఇనుము               1.7 మి.గ్రా

 సోడియం            3 మి.గ్రా

 పొటాషియం        94 మి.గ్రా

పీచు పదార్థం        1.0 మి.గ్రా

శక్తి                      56 కేలరీలు

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE