సగ్గుబియ్యం అనగానే ముందుగా పండగనాడు చేసే పరమాన్నం గుర్తొస్తుంది. కానీ సగ్గుబియ్యంతో పలు చిరుతిళ్ళు చేసుకోవచ్చని  చాలామందికి తెలియదు. ఈ వంటల జాబితాలో చిన్నారులు ఇష్టపడే సగ్గుబియ్యం పకోడీ కూడా ఒకటి.  

కావలసినవి            

సన్న సగ్గుబియ్యం, చిక్కని పెరుగు, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి - అరకప్పు చొప్పున, ఉల్లిపాయలు (పెద్దవి) - 2, అల్లం తురుము - 2 చెంచాలు, పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ

 ముందుగా గిలకొట్టిన పెరుగులో సగ్గుబియ్యాన్ని 5 గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానాక బియ్యప్పిండి, బొంబాయిరవ్వలో వాటిని కలిపి, ఆపై.. సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్నిబట్టి ఇంకా పెరుగూ కలుపుకోవచ్చు. ఆ తర్వాత.. మూకుడులో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ పిండిని పకోడీ ల మాదిరిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి నచ్చిన చట్నీతో నంజుకు తింటే ఎంతో రుచిగా ఉంటాయి.  

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE