దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య నివారణకు దానిమ్మ రసం వినియోగం బాగా అక్కరకొస్తుంది. ఇక దానిమ్మకు తోడు 4 పుదీనా ఆకులు చేర్చితే ఇతర పోషకాలతో బాటు రుచి, సువాసన చేకూరతాయి. ఇందులో కలిపే బెల్లం వల్ల కాల్షియం, ఐరన్ లభిస్తాయి. విష జ్వరాలు., ఇతర అనారోగ్యాలతో చికిత్స తీసుకొన్న రోగులు రోజూ గ్లాసు చొప్పున ఈ దానిమ్మ రసం తాగితే వారంలో కోలుకొంటారు.

 కావలసినవి

దానిమ్మ గింజలు - 1 కప్పు, బెల్లం పొడి - 2 చెంచాలు, తాజా పుదీనా ఆకులు - 10

 చేసే విధానం

దానిమ్మ గింజలు, బెల్లం పొడి, పుదీనాలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి తిప్పుకోవాలి. ఆ తర్వాత దానికి మరికొన్ని నీళ్లు కలిపి తిప్పి దించి వడకట్టుకొంటే దానిమ్మ, పుదీనా జ్యూస్ సిద్దమైనట్లే. కావాలనుకొంటే ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE