ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత మనందరికీ తెలుసు. మన దేశంలో ఉల్లిపాయ లేని వంటకం  కనిపించటం అరుదేనని చెప్పాలి.  5000 ఏళ్ళకు పూర్వంనుంచే ఉల్లి వినియోగం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. తెలుపు, ఎరుపు రంగుల్లో ఇవి లభిస్తాయి. ఉల్లిపాయాలనే  కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగడ్డ,  నీరుల్లిపాయ అంటారు.  నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లిపాయాల్లో ఘాటుగా ఉండే రకంతో బాటు తియ్యగా ఉండేవి కూడా ఉంటాయి.

ఉపయోగాలు

 • వేసవి కాలం లో పచ్చిఉల్లి తీసుకునే వారికి వడదెబ్బ తగలదు.
 • నీళ్ళ విరేచనాలు, వాంతులతో బాధపడేవారు ఉల్లి రసం, సున్నం సమపాళ్ళలో నీళ్లలో కలుపుకొని రెండు చెంచాల చొప్పున తాగితే సమస్య అదుపులోకి వస్తుంది.
 • గుప్పెడు ఉల్లిపాయ తరుగు,  6 మిరియాలు కలిపి  దంచి ఆ రసాన్ని తాగితే కలరా లక్షణాలు తగ్గుతాయి. రుచికోసం పటికబెల్లం పొడి కలుపుకోవచ్చు.
 • ఉల్లిరసాన్ని, నెయ్యిని సమపాళ్ళలో కలిపి చెంచాడు చొప్పున మూడు పూటలా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది.
 • తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వు ఉండే ఉల్లిలో కోరినంత పీచు ఉంటుంది. దీనివల్ల మలబద్దకం దరిచేరదు. బరువు నియంత్రణలో ఉంటుంది.
 • ఉల్లిలోని ఎలిసిన్ (పైటో కెమికల్ కంపౌండ్స్) క్యాన్సర్ నివారిణిగా పనిచేయటంతో బాటు అధిక రక్త పోటును నియంత్రించి గుండెకు రక్త ప్రసరణ సులభతరం చేస్తుంది.
 • మధుమేహులు రోజూ ఉల్లిపాయ రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఉల్లిలోని క్రోమియం రక్తంలో  ఇన్సులిన్ తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. 
 • పచ్చి ఉల్లిపాయ ముక్కలను రోజూ నమిలి ఆ రసాన్ని పది నిమిషాల పాటు పుక్కిలిస్తే దంతాల,చిగుళ్ళ నొప్పులు తగ్గటమే గాక నోట్లో చేరిన క్రిములు, నోటి దుర్వాసన కూడా దూరమౌతాయి.
 • రోజూ పచ్చి ఉల్లిపాయలు తినేవారికి కంటినిండా నిద్ర పడుతుంది.
 • ఉల్లి గుజ్జును మొలల మీద, జారిన మలాశయం మీద లేపనంగా పూసుకుంటే మొలల్లోని వాపు, దురద, నొప్పి తగ్గుతాయి.
 • పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
 • రోజుకు మూడుసార్లు, మూడు నెలలపాటు తాగితే రెండు చెంచాల ఉల్లిరసాన్నితీసుకునేవారికి  మూత్రపిండాల సమస్యలు రావు.
 • మూత్రం మంటతో బాధ పడేవారు రెండు తెల్ల ఉల్లిపాయలను తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగితే సమస్య దారికొస్తుంది.
 • నాలుగు టీస్పూన్ల ఉల్లిరసానికి చిటికెడు ఇంగువ పొడి, చిటికెడు నల్ల ఉప్పు కలిపి రోజుకు రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
 • రెండు చెంచాల ఉల్లి రసం, అంతే మొత్తం నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి రెండు సార్లు తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
 • రెండు ఉల్లిపాయలను దంచి,  3 చెంచాల వెనిగర్‌ కలిపి తింటేజీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

 సౌందర్య పరిరక్షణలో

 • ఉల్లిపాయలో అధిక శాతంలో ఉండే సల్ఫర్ మాడు భాగంలో రక్త ప్రసరణను పెంచి, తద్వారా కేశాలకు కొత్త శక్తిని ఇస్తుంది. గోరు వెచ్చని కొబ్బరినూనెను మాడుకు పట్టించి మర్దనా చేసి అరగంట తర్వాత ఉల్లిపాయ గుజ్జును తలకు పట్టించి అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకొంటే జుట్టు రాలటం ఆగిపోవటమే గాక  కొత్తగా వెంట్రుకలు కూడా  మొలుస్తాయి.
 • రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లి రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
 • కాలుష్యం, చెమట కారణంగా మాడు భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ఉల్లిపాయ రసం చక్కని విరుగుడు. మాడు చర్మం మీద మూసుకు పోయిన కేశ రంద్రాలనూ ఇది తెరుచుకునేలా చేస్తుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE