• గుడ్డు సొనలో చిటికెడు పంచదార లేదా మొక్కజొన్న పిండి కలిపితే ఆమ్లెట్ బాగా పొంగుతుంది.
  • వేపుడు కూరలు చేసేటప్పుడు కూరగాయ ముక్కల్లో చెంచాడు వెనిగర్ వేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోవు.
  • పచ్చి అల్లాన్ని ముక్కలుగా కోసుకొని ఎండబెట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకొని, రోజూ రెండు ముక్కలు టీ డికాక్షన్లో  వేసుకుంటే టీ మంచి రుచిగా ఉండటమే గాక ఆరోగ్యం కూడా.
  • పూరీలు వండేటప్పుడు నూనెలో రెండుమూడు జామ ఆకులు వేస్తే పూరీలు తెల్లగా వస్తాయి.
  • క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో 2 ముక్కలు  అల్లం వేస్తే కూర మంచి సువాసనగా ఉంటుంది. 
  • గుడ్లు ఉడకపెట్టే నీటిలో కొంచెం ఉప్పు వేస్తే పెంకు సులభంగా వస్తుంది.
  • ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి తుడిస్తే ఈగలు రావు.
  • పొరబాటున నూనె, నెయ్యి వంటివి ఒలికిపోతే కొంచెం మైదా పిండి చల్లితే వెంటనే పీల్చుకుంటుంది.
  • ఓపెన్ చేసిన బిస్కెట్ పాకెట్లు బియ్యం డబ్బాలో పెడితే కరకరలాడుతూనే ఉంటాయి.
  • వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో ఒక చెంచా పాలు పోయాలి.
  • సాక్సులు ఉతికే నీటిలో నిమ్మరసం, వంట సోడా కలిపి నానబెట్టి ఉతికితే సులభంగా శుభ్రం అవుతాయి.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE