• ఉచ్చారణ స్పష్టంగా లేని పిల్లలకు 2 గ్రాముల ఉసిరి పొడిని తగినంత ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే మాటలు స్ఫష్టంగా వస్తాయి.
  • పిల్లలకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే ఉల్లిపాయ వాసన చూపిస్తే ఎక్కిళ్లు నెమ్మదిస్తాయి.
  • పిల్లలకు ఆగకుండా విరేచనాలు అవుతుంటే అర చెంచా గసగసాలు నూరి రెండు చెంచాల పెరుగులో కలిపి తినిపిస్తే తక్కువ సమయంలో విరేచనాలు కట్టుకుంటాయి.
  • అజీర్తితో బాధపడే చిన్నారులకు తమలపాకు రసంలో తేనె కలిపి నాకిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • అరచెంచా చొప్పున అల్లం రసం, తులసి రసం కలిపి రంగరించి తేనెతో కలిపి పిల్లలకు ఇస్తే జలుబు, దగ్గు మాయమవుతాయి .
  • ఒక గ్రాము శొంఠి ముక్కను పాలు లేక నీటితో సాది అర చెంచా చొప్పున రోజూ పిల్లలకు అందిస్తే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన తెమడ బయటికి వచ్చి శ్వాశ మెరుగుపడుతుంది.
  • తమలపాకు మీద కొద్దిగా ఆముదం రాసి పొయ్యి మీద వేడి చేసి రొమ్ము పడిశం పట్టిన పిల్లల ఛాతీ మీద పెట్టి వేడినీటిలో ముంచి పిండిన బట్టతో కాపడం పెడితే కఫం కరిగి కొంచెం కొంచెంగా బయటికి వచ్చి శ్వాశ తీసుకోవటం సులభమవుతుంది.
  • ఆగకుండా ఎక్క్కిళ్లు వస్తున్న పిల్లలకు ఉల్లిపాయ వాసన చూపిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE