చిలక్కొట్టిన జాంపండు ఎంత రుచో మనకు తెలుసు. ఆరోగ్యానికి జామకాయ ఎంతగా దోహదపడుతుందో కూడా తెలుసు. అయితే జాంపండుతో బాటు జామ ఆకు సైతం ఆరోగ్య, సౌందర్య పరిరక్షణకు చక్కగా ఉపయోగపడుతుందని మాత్రం బహు కొద్దిమందికే తెలుసు. పలు రకాల అనారోగ్య సమస్యలకు జామ ఆకు ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

ఆరోగ్య పరిరక్షణకు...

 • తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారకుండా చేసి ఆకలిని తగ్గించే లక్షణం జామ ఆకుకు ఉంది. అందుకే బరువు తగ్గాలనుకున్న వారు రోజూ 2 జామ ఆకులు తింటే సరి.
 • 5 కప్పుల నీటిలో గుప్పెడు లేత జామ ఆకు వేసి సగానికి మరిగించి పుచ్చుకుంటే డెంగూజ్వరం త్వరగా తగ్గుతుంది.
 • రక్తంలోని మేలు చేసే కొలెస్ట్రాల్ ను ప్రభావితం చేయకుండా చెడుకొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఈ ఆకుకు ఉంది.
 • మధుమేహులు రోజూ జామ ఆకు వేసి కాచిన టీ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
 • పంటి నొప్పి, చిగుళ్ళ వాపు బాధితులు లేత జామ ఆకు నమిలితే సమస్య ఉపశమిస్తుంది.
 • తేనెటీగలు, కందిరీగలు కుట్టిన చోట జామ ఆకు నలిపి రుద్దితే నొప్పి, వాపు తగ్గుతాయి.
 • ఎలర్జీ కారణంగా చర్మం దురద పెడుతుంటే ఆయా భాగాలలో జామ ఆకును రుద్దితే సరి.
 • భోజనం తర్వాత అయ్యే విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సందర్భాల్లో జామ ఆకు తింటే పరిస్థితి విషమించదు.
 • జామ ఆకులోని యాంటీ మైక్రోబయల్ గుణాలు నీళ్ళ విరేచనాలను నియంత్రిస్తాయి. అందుకే ఈ సమస్య తలెత్తితే జామ ఆకులు వేసి మరిగించిన నీరు తాగితే సరి.
 • ప్రోస్టేట్ గ్రంధి పెరిగినవారు, ప్రోస్టేట్ కేన్సర్ బాధితులు రోజూ లేత జామ ఆకులు తింటే చికిత్సకు శరీరం బాగా స్పందిస్తుందని పరిశోధనల్లో రుజువైంది.
 • పురుషునిలోని సంతానలేమి సమస్యకు జామ ఆకు ఔషధంగా పనిచేస్తుంది.
 • జామ ఆకు టీ రోజూ తాగితే బ్రాంకైటిస్, శ్వాశ సంబంధిత సమస్యలు, దగ్గు తదితరాలు దారికొస్తాయి. 

అందం పరిరక్షణలో... 

 • జామ ఆకులో పుష్కలంగా విటమిన్-సి ఉంటుంది. అందుకే నూరిన జామ ఆకు మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మొటిమలు, పొక్కుల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
 • జామ ఆకు వేసి మరిగించిన నీటిని చల్లబరచి జుట్టు కుదుళ్ళకు తరచూ పట్టిస్తూ ఉంటే జుట్టు రాలటం ఆగిపోతుంది.
 • సాగిన, పొడిబారిన ముఖ చర్మానికి జామ ఆకు మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత కడుక్కుంటే చర్మం పూర్వ శోభను సంతరించుకోగలదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE