పండుగలు, ఇతర శుభ కార్యాల్లో తమలపాకులు, వక్కలతో కూడిన తాంబూలానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో మనకు తెలుసు. ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తాంబూల చర్వణం శ్రేష్టమైనదని సూచిస్తుంది. మనం ఎదుర్కొనే అనేక చిన్నా చితకా అనారోగ్యాలకు తమలపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. గృహవైద్యంలో తమలపాకు ఉపయోగాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం!

 • దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్యాలకు తమలపాకు దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడే పిల్లలకు తేనె, తమలపాకు, తులసి, అల్లం రసాలను చెంచా చొప్పున తీసుకొని చిటికెడు మిరియాలు పొడి కలిపి నాకిస్తే సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే తరచూ జలుబు బారిన పడే చిన్నారులకు వేడి చేసిన తమలపాకు మీద ఆముదం రాసి ఛాతిమీద వేసి కడితే ఊపిరితిత్తుల్లోని కఫము కరిగి ఎంత మొండి జలుబు అయినా వదిలిపోతుంది.
 • తీవ్రమైన జ్వరం బారిన పడిన వారు చెంచా తమలపాకు రసంలో చిటికెడు మిరియాలపొడి కలిపి 3 పూటలా తీసుకుంటే జ్వరం తీవ్రత తగ్గుతుంది.
 • మోకాళ్ళు, గిలక, తుంటి వంటి కీళ్ల నొప్పి బాధితులు తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి ఉన్నచోట కడితే నొప్పి తగ్గుతుంది.
 • మొండి కురుపులు, గాయాలకు నెయ్యి రాసిన లేత తమలపాకుతో కట్టుకడితే రెండోరోజుకు మానటం మొదలవుతుంది.
 • భరించలేని తలనొప్పితో సతమతమయ్యే పరిస్థితిలో ముక్కుల్లో 2 చుక్కల తమలపాకు రసం వేసుకుంటే తలనొప్పి ఉపశమిస్తుంది.
 • తరచూ తమలపాకు తినేవారిలో అందులోని యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం వల్ల తగినంత రోగ నిరోధక శక్తి చేకూరటమే గాక వయసు ప్రభావం బయటపడదు.
 • తాంబూలంలో వాడే సున్నం వల్ల ఎముకలు గుల్లబారటం, విరగటం వంటి సమస్యలు రావు.
 • బోదకాలు బాధితులు రోజూ 10 తమలపాకులను ఉప్పుతో కలిపి నూరి వేడి నీళ్లతో తీసుకుంటే క్రమంగా వాపు తగ్గుతుంది.
 • ఊబకాయులు 2 నెలలపాటు రోజుకోమారు తమలపాకులో 5 మిరియంగింజలు పెట్టి తిని వెంటనే నీళ్లు తాగుతుంటే సన్నగా నాజూగ్గా తయారవుతారు.
 • భయం కారణంగా గుండె దడగా ఉంటే చెంచా తమలపాకు రసాన్ని తాగితే గుండెలయ క్రమబద్దీకరించబడుతుంది.
 • ఆకలి లేకపోవటం, నీరసం వంటి సమస్యలకు తమలపాకు షర్బత్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 • గాయకులు, ఉపన్యాసకులు ప్రదర్శనకు ముందు తమలపాకు నమిలితే గాత్ర శుద్ధి జరిగి శ్రావ్యంగా పాడగలుగుతారు.
 • తీవ్రంగా అరచి కేకలు పెట్టటం వల్ల కంఠం పూడుకుపోయిన వారికి తమలపాకు రసం మంచి ఔషధం.
 • తమలపాకు తినేవారిలో నోటి దుర్వాసన, భుక్తాయాసం వంటి సమస్యలు ఉండవు. మాట కూడా స్పష్టంగా ఉంటుంది. తగినంత లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
 • పులిపిరుల మీద తమలపాకు తొడిమలతో తడి సున్నాన్ని 7 రోజులపాటు పూస్తే పులిపిరులు రాలిపోతాయి.
 • తమలపాకు తినేవారిలో అంగ స్థంభన సమస్య ఉండదు.
 • తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే మొండి చుండ్రు అయినా తగ్గాల్సిందే.
 • తమలపాకుల్లో వక్క, లేనిపోని తీపి పదార్ధాలకు బదులుగా యాలుక, లవంగం చేర్చి భోజనం అనంతరం సేవిస్తే ఆహారం చక్కగా జీర్ణమవటమే గాక మలబద్దకం వంటి సమస్యలూ ఉండవు.
 • వేడిగా ఉండే తమలపాకు రసాన్ని కొబ్బరినూనెతో కలిపి వెన్నుకు మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 

జాగ్రత్తలు

 • సంతానం కావాలనుకునే మహిళలు తొడిమ తీసిన తమలపాకును మాత్రమే తినాలి.
 • తమలపాకు తినే అలవాటు వ్యసనంగా మారకుండా చూసుకోవాలి.
 • తమలపాకులో అతిగా సున్నం, వక్క, పొగాకు వంటివి చేర్చి తినటం వల్ల నోటి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడాల్సి రావచ్చు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE