మిగతా సీజన్లలో కంటే వానాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ. వాన నీరు ఎక్కడికక్కడ నిలిచి పోవటంతో ఆయా ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగావటం, అంటువ్యాధుల ముప్పు, తాగు నీరు కలుషితం కావటం వల్ల వాంతులు, విరేచనాలు కావటం వంటి సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా నమోదవుతుంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు త్వరగా ఇలాంటి సమస్యల బారిన పడుతుంటారు. ఈ సమస్యల బారిన చిన్నారులు పడకుండా పెద్దలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

 • ఇంటి పరిసరాలు, పెరడు ప్రాంతాల్లో వాన నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలి. చెత్తాచెదారం, వాడేసిన సీసాలు, కొబ్బరి చిప్పలు, వాహనాల టైర్లు, నీళ్ల డ్రమ్ముల వంటివి ఉంటే తీసేయాలి. లేకుంటే వాటిలో దోమలు గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలు రావచ్చు.
 • తేమ వాతావరణంలో దగ్గు, జలుబు, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఎక్కువ గనుక పిల్లల్ని వానలో తిరగనీయవద్దు. .
 • వానలో తడిసిన పిల్లలకు వేడినీటి స్నానం చేయించటంతో బాటు మంచి ఆహారం, తగినంత నిద్ర అందేలా చూడాలి.
 • తడి బట్టలను, తడి టవల్స్‌ను ఇంట్లో ఉంచితే బాక్టీరియా, ఫంగస్‌ అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల పిల్లలకు చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని గాలి తగిలేట్లు ఆరేయాలి.
 • వానాకాలంలో పిల్లలు స్నానానికి గోరువెచ్చని నీటివాడాలి. 2 పూటలా స్నానంచేయాలి. స్నానం చేసే నీటిలో కాస్త డెటాల్ కలపటం, మృదువైన యాంటీబాక్టీరియా సోప్‌ వినియోగం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.
 • వానాకాలంలో మంచి నీటి ఫిల్టర్ వాడటం తప్పనిసరి. ఫిల్టర్ లేనివారు కాచి వడపోసిన నీటిని తాగటం మరువొద్దు.
 • వర్షాకాలంలో పిల్లల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను మరునాడు తినొద్దు. వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. రోడ్డు వెంట అమ్మే పానీపూరీ వంటివి అసలేవద్దు.
 • వానాకాలంలో తరచూ పిల్లలకు వేడివేడి సూపులు, అల్లం టీ వంటివి ఇవ్వాలి. పచ్చిగుడ్డు, పచ్చి కూరగాయలు, మజ్జిగకు బదులు ఉడికించిన గుడ్డు, వేడి వేడి పాలు ఇవ్వండి.
 • ఇంట్లోని కూలర్లు, ఫ్లవర్‌వాజ్‌లు, ఏ.సి.లను శుభ్రపరచటం మరువొద్దు. లేకుంటే దోమల బెడద పొంచివున్నట్టే.
 • వర్షాకాలంలో పిల్లలకు వదులైన, సౌకర్యవంతమైన దుస్తులు వేయాలి. రైన్ కోట్, గొడుగు వంటివి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. బయట ఆడుకొని ఇంటికి రాగానే వేడినీళ్లతో స్నానం చేయించాలి.
 • పిల్లల చేతి, కాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తెరించాలి. వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటును మాన్పించటంతో బాటు గోళ్లలో చేరిన మట్టిని తీసేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE