• చపాతీ పిండిలో నీళ్లకు బదులు కొబ్బరినీళ్లను పోసి కలిపితే చపాతీలు 2 రోజులపాటు తాజాగా ఉంటాయి.
 • మిగిలిపోయిన చపాతీ పిండి ముద్దను తడిగుడ్డలో చుట్టి పెడితే మరునాటికి కూడా పొడిబారకుండా ఉంటుంది.
 • చపాతీ పిండి పీటకి అతుక్కుని రాకపోతే పీటను 2 నిమిషాలు ఫ్రిజ్ లో పెడితే అతుక్కున్న పిండి సులభంగా వస్తుంది.
 • తోటకూరను అల్యుమినియం ఫాయిల్లో లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
 • ఇడ్లీ, దోశలు పిండి మీద ఒక తమలపాకు వేస్తే పిండి మూడు రోజులపాటు పులవకుండా ఉంటుంది.
 • పచ్చి అప్పడాలు తాజాగా, విరిగిపోకుండా ఉండాలంటే వాటిని పాలిథిన్ కాగితంలో పెట్టి బియ్యం లేదా పప్పు డబ్బాలో పెట్టుకోవాలి.
 • సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు ఉడికిన సగ్గుబియ్యంలో కొంచం మజ్జిగ కలిపితే వడియాలు తెల్లగా వస్తాయి. మంచి రుచిగానూ ఉంటాయి.
 • మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు సెనగపిండిలో 2 చెంచాల నెయ్యి కలిపితే బజ్జీలు కరకరలాడుతూ రుచిగావుంటాయి.
 • కోడిగుడ్లు తాజావో కాదో తెలుసుకోవాలంటే చల్లని నీళ్లలో ఉప్పు కలిపి అందులో కోడి గుడ్లను వేస్తే మునిగినవన్నీ తాజా గుడ్లు. తేలినవన్నీ పాత లేదా పాడైన గుడ్లు అని అర్థం.
 • చలికాలంలో గోరువెచ్చని పాలలో తోడు వేసి ఆ గిన్నె మీద మూత పెట్టి కుక్కరులో అడుగున నీరు పోసి ఈ గిన్నెను ఉంచి మూతపెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి బయట పెడితే త్వరగా పెరుగు తోడుకుంటుంది.
 • మధుమేహులు అన్నం తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే అన్నం ఉడికేటప్పుడు చిన్న దాల్చిన చెక్క వేస్తే సరి.
 • బియ్యం, పప్పుల డబ్బాల్లో గుప్పెడు వేపాకులు లేదా పసుపుకొమ్ములు లేదా వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఎంతకాలం నిల్వ ఉన్నా పురుగు చేరదు.    
 • మొక్క జొన్న గింజలను డీప్ ఫ్రిజ్లో పెట్టి అరగంట ఉంచి తీసి వాటిని నేరుగా వేయిస్తే పాప్ కార్న్ పెద్ద సైజులో వస్తుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE