• చపాతీ మెత్తదనం దాన్ని కలిపే పద్దతిపై ఆధారపడి ఉంటుంది. అందుకే పిండిని బాగా మర్దన చేసి తడి బట్టలో చుట్టి పెట్టి అరగంట తర్వాత  చపాతీలు చేస్తే అవి పొంగి,  మెత్తగా వస్తాయి.
  • గోధుమ పిండిలో తగినంత ఉప్పు, చెంచా నూనె, చెంచా పంచదార పొడి వేసి గోరు వెచ్చని నీళ్లతో చపాతీ పిండి కలుపుకుని చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి.
  • చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో 2 పండిన అరటిపళ్ళ గుజ్జు కలిపితే చపాతీలు మెత్తగా ఉండటమే గాక చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి. 
  • చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో గుప్పెడు శెనగపిండి కలిపితే చపాతీ మంచి రంగు, వాసన వస్తుంది.
  • చపాతీ పిండిలో 100 గ్రాముల తాజా వెన్న కలిపితే చపాతీలు మెత్తగా రావటమే గాక రుచి అద్భుతంగా ఉంటుంది.
  • పప్పు వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి వండి, ఆ వేడి పప్పు నీటిని గోధుమ పిండికి కలిపి చపాతీ చేస్తే మెత్తగా రావటమే గాక పప్పు లోని పోషకాలూ అందుతాయి.
  • చపాతీలు మెత్తగా ఉండి, పూరీల్లా బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచం పెరుగు లేదా మజ్జిగ కలిపితే చాలు.
  • చిన్న పిల్లలకోసం చపాతీ చేసేటప్పుడు పెనం మీద చపాతీ వేసి మూట బోర్లించి సన్నని సెగ మీద కాల్చితే మెత్తగా వస్తాయి.
  • పీట మీద చేసిన చపాతిపై 2 చుక్కలు వేసి పూసి దాన్ని సగానికి మడిచి, మళ్ళీ  త్రికోణంలా మడిచి పీటపై పెట్టి ఒత్తుకుంటే పొరలు పొరలుగా ఉండి మెత్తగా వస్తాయి.
  • చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడకపోవడం, చేయగానే హాట్ బాక్స్ లో వేసుకుంటూ పోవటం వల్ల అవి వేడిగా, మెత్తగా ఉంటాయి.



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE