దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది బాణాసంచా వెలుగులే. అయితే బాణాసంచా కొనుగోలు మొదలు కాల్చే వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దీపావళి పండుగ ఆనందాన్ని ఆసాంతం ఆస్వాదించగలము.ఈ క్రమంలో బాణా సంచా విషయంలో అందరూ ఈ కింది విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.

 • సొంతగా బాణసంచా తయారు చేయొద్దు. బాణాసంచాను లెసైన్సు ఉన్న దుకాణాల్లోనే కొనాలి.
 • బాణాసంచా ఆరుబయట కాల్చాలి. బాణాసంచా కాల్చేటప్పుడు తప్పని సరిగా చెప్పులు వేసుకోవాలి.
 • బాణాసంచా కాల్చే ప్రదేశంలో ముందుజాగ్రత్తగా రెండు మూడు బకెట్ల నీరు అందుబాటులో ఉంచుకోండి.
 • బాణాసంచా కాల్చేటప్పుడు ఉతికి బయట ఆరేసిన బట్టలు తీసేయాలి.
 • బాణాసంచా చప్పుడుకు పెంపుడు జంతువులూ భయపడతాయి గనుక వాటిని గదిలో పెట్టి తలుపేయటం మంచిది.
 • గాలి ఎక్కువగా ఉంటే బాణాసంచా కాల్చకపోవటమే మేలు. మద్యం సేవించి టపాసులు కాల్చొద్దు. ఎక్కువ శబ్దం వచ్చే బాంబుల వల్ల పసిపిల్లలు, వృద్దులు ఇబ్బందిపడతారని గురుంచుకోవాలి.
 • బాణాసంచాను ఒకేచోట పెడితే అందులో నిప్పురవ్వలు పడితే ప్రమాదం గనుక ఇంట్లోనే పెట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి.
 • ఐయిదేళ్ళ లోపు పిల్లలకు టపాకాయలు చేతికి ఇవ్వొద్దు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. పిల్లల వయసును బట్టి తగిన బాణాసంచాను పెద్దలు ఎంపిక చేసి కొనాలి తప్ప వారు కోరినవి కాదు.
 • ఒకేసారి రెండు మూడు టపాసులు పేల్చొద్దు. ఒదాని తరువాత ఒకటి కాల్చాలి.
 • భూచక్రాలను ఆరుబయటే కాల్చాలి. ఇంట్లో కాల్చితే తివాచీలు, సోఫాలు అంటుకుపోయి ప్రమాదం ఉంది.
 • బాణాసంచా కాల్చేటప్పుడు నూలు దుస్తులు ధరించాలి. అవి మరీ వదులుగా, వేలాడేలా ఉండకూడదు.
 • టపాసులు కాల్చేటప్పుడు చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకూడదు.
 • బాణాసంచా వెలిగించేందుకు కాకరపువ్వొత్తి వాడడం మంచిది. కాల్చిన తర్వాత మిగిలిన చువ్వలను నీళ్లలో ముంచాలి.
 • రాకెట్ల కాల్చేటప్పుడు సమీపంలో పూరిళ్లు, పెట్రోల్ బంకులు, గడ్డివాములు ఉన్నాయేమో చూసుకోవాలి.
 • సగం వెలిగి ఆరిపోయిన బాణాసంచాను మళ్ళీ వెలిగించొద్దు. వీలుంటే నీళ్లు పోయటం మంచిది. బాణాసంచా వెలిగించి మనుషుల మీదికి విసిరే ప్రయత్నం పొరబాటున కూడా చేయొద్దు.
 • ఎవరికైనా పొరపాటున బాణాసంచా అంటుకుంటే అటూ ఇటూ పరిగెత్తక, నేలపై అటు ఇటు దొర్లితే మంట ఆరిపోతుంది.
 • టపాసులు కాల్చిన తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాతే భోజనంచేయాలి.
 • బాణాసంచా ఒంటిపై బడి గాయలయితే వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గర్లోని వైద్యునిపుణులను సంప్రదించాలి.
 • బాణాసంచాలోని సల్ఫర్ పర్యావరణానికి హాని చేస్తుంది గనుక తక్కువ మొత్తంలో మాత్రమే టపాకాయలు కాల్చటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE