• ఒకరు ముద్దు.. ఇద్దరు చాలు అనుకోవటం తల్లీబిడ్డా ఆరోగ్యానికి మంచిది. బిడ్డకూ  బిడ్డకు కనీసం రెండేళ్లు ఎడం ఉండటమూ అవసరమే
  • ఆడ పిల్లలకు 22 ఏళ్ళు నిండిన తర్వాత వివాహం చేయటం మంచిది. గర్భధారణకు 22 నుండి 30 ఏళ్ళ మధ్య వయసు తగినదని గుర్తించాలి.
  • గర్భిణి నెలనెలా వైద్య పరీక్షలు తీసుకోవాలి. కాన్పు ఆసుపత్రిలోనే అయ్యేలా చూసుకోవాలి.
  • బిడ్డకు 6 నెలలు తల్లిపాలు, ఆ తర్వాత ఇంటిలో చేసిన అదనపు ఆహారం ఇవ్వాలి.
  • మూడేళ్లలోపు పిల్లలకు నూనెలు, నెయ్యి, పాలు, కూరగాయలు, పండ్లు, చిరుతిండి రోజుకు ఐదారు దఫాలుగా ఇవ్వాలి.
  • పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా ఇవ్వాలి.
  • వైద్యులు సూచించిన సమాయానికి తప్పక టీకాలు వేయించాలి.
  • సాధారణ జలుబు, దగ్గులకు మందులు వాడొద్దు. శ్వాస ఇబ్బంది అయితే వైద్య సలహా పొందాలి.
  • పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు తాగించాలి.
  • మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • జబ్బుపడిన పిల్లలకు పూర్వం కంటే ఎక్కువ ఆహారం అందించాలి.
  • 3 నెలలకోసారి పిల్లల బరువు చూడాలి. తక్కువగా ఉంటే ఆహారంలో మార్పులు చేయాలి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE