• ఎండిన కమల ,నిమ్మ తొక్కలను పొడి చేసి సర్ఫ్, సున్ని పిండిలో కలిపి వాడుకుంటే సువాసనతో బాటు మురికి కూడా వదులుతుంది. ఎండు నిమ్మ చెక్కలతో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు తోమితే తళ తళా మెరుస్తాయి.
  • మోచేతులు ,మోకాళ్ళ చర్మం నల్లబడిన వారు వాడిన నిమ్మ తొక్కతో రుద్దుతుంటే నలుపు పోతుంది.
  • నిమ్మకాయను మరుగుతున్న నీటిలొ 1 నిమిషం వేసి తీసి పిండితే రెట్టింపు రసం వస్తుంది.
  • మాడిన ఆహారం కారణంగా కుక్కర్ లోపలి అడుగు నల్లగా మారితే వాడిన నిమ్మచెక్కలు, నీరుపోసి ఉడికిస్తే ఆ నలుపు పోతుంది.
  • డ్రై ఫ్రూట్స్ డబ్బాలో 10 లవంగాలు వేస్తే వాటిలో పురుగు చేరదు. తాజాగానూ ఉంటాయి.
  • గాజు గ్లాసులు ఒకదానిలొ ఒకటి ఇరుక్కుని రాకపోతే వాటిని వేడినీటిలో పెట్టి పై గ్లాసులో చల్లని నీళ్ళు పోస్తే వెంటనే వచ్చేస్తాయి.
  • కొత్త బియ్యంలో చెంచా నూనె, కంది పప్పు వేసి వండితే అన్నం ముద్దగాకుండా పొడి పొడిగా వస్తుంది.
  • రెమ్మల నుంచి కరివేపాకును వేరు చేసి పొడిగా ఉండే గాజు సీసాలో పెట్టి మూతపెట్టుకుంటే నెలరోజులు పాడు కాదు.
  • అట్లపిండిలో గుప్పెడు బంగాళాదుంప ముక్కలు కలిపి రుబ్బితే అట్లు రుచిగా వస్తాయి.
  • పూరీలు కరకరలాడాలంటే పిండిలో అరకప్పు పాలు కలిపి ఒక గంట నాననివ్వాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE