• వేడి చేసి ముక్కు నుంచి రక్తం పడుతుంటే, ముక్కు రంధ్రాల్లో 2 చుక్కల తాజా దానిమ్మ రసం వేస్తే రక్తస్రావం ఆగిపోతుంది.
  • మూత్ర సమస్యలున్నవారు గ్లాసు నీళ్లలో అరచెంచా యాలకుల పొడి కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
  • నోటి దుర్వాసనతో బాధపడేవాళ్లు ఉదయం నిద్ర లేవగానే నాలుగైదు గ్లాసుల మంచినీరు తాగితే కొంతకాలానికి దుర్వాసన తగ్గుతుంది.
  • చర్మం దురద పెట్టినట్టు అనిపిస్తే స్నానపు నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మంచి గుణం కనిపిస్తుంది.
  • ముఖం మీది మచ్చలు పోవాలంటే చెంచా చొప్పున చందనం నూనె, ఆలివ్ ఆయిల్‌ కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి మరునాటి ఉదయం చన్నీటితో కడిగితే మంచిఫలితం ఉంటుంది.
  • జుట్టు రాలే సమస్యకు వారానికి ఒకసారి 2 చెంచాల చొప్పున బాదం, ఆలివ్ నూనెలు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. 
  • రాత్రిపూట పావుగ్లాసు గోరువెచ్చని నీటిలో 8 కిస్మిస్, 1 ఎండు ఖర్జూరం వేసి పెట్టి మరునాటి ఉదయం వాటిని తీసి పిసికి తేనెలో కలిపి క్రమం తప్పక తీసుకుంటే గుండె బలం పెరిగి రక్తప్రసరణ బాగుంటుంది.
  • జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ తో బాధపడే వారు గుప్పెడు నల్ల జీలకర్ర 5 నిమిషాలు సన్నని సెగమీద వేయించి, గుడ్డలో మూటకట్టి వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.
  • ఎండు ఖర్జూరం పండ్లు తిని, వేడినీళ్ళు తాగితే నడుము నొప్పి తగ్గుతుంది.
  • రోజూ ఉదయంపూట పావుకప్పు ఉసిరి రసం తీసుకుంటే గుండెనొప్పి తగ్గిపోతుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE