పాతరోజుల్లో మంచినీటి నిల్వకు రాగి పాత్రలే వాడేవారు. రాత్రి పడుకోబోయే ముందు సైతం రాగి చెంబుతో నీటిని మంచం కింద పెట్టుకుని ఉదయం లేవగానే తాగేవారు. కారణాలు ఏమైనా ఇప్పుడా పరిస్థితి లేదు.  రాగి పాత్రలోని నీరు తాగటం వల్ల ఎన్నో సానుకూల ఫలితాలుంటాయని ఆధునిక పరిశోధనలు పదే పదే వెల్లడిస్తున్న నేపథ్యంలో రాగి పాత్రలో నిలవ చేసిన నీటి సుగుణాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 • శరీరంలో రాగి లోపిస్తే తలెత్తే థైరాయిడ్‌ సమస్యలకు రాగి పాత్రలోని నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 • పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగితే పెద్ద పేగు శుభ్రపడి తినే ఆహారంలోని పోషకాలను శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది.
 • రక్తశుద్ధికి, రక్త కణాల ఉత్పత్తికి, కండరాల ఎదుగుదలకు రాగిపాత్రల్లోని నీరు దోహదపడుతుంది.
 • కడుపు ఉబ్బరం, కడుపు మంట నివారించ బడతాయి. మలబద్దకం పోయి సుఖవిరేచనం అగుతుంది.
 • రాగి లోహానికున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిలో సూక్ష్మక్రిములు చేరినా జీవించలేవు.
 • శరీరంలోని హానికారక కొవ్వులకు రాగి లోహం విరుగుడుగా పనిచేసి అధిక బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది.
 • రాగి పాత్రలోని నీరు తాగే చిన్నారుల్లో ఏకాగ్రత, గ్రహణ శక్తి, మెదడు పనితీరు మెరుగుపడినట్లు పలు పరిశోధనల్లో రుజువైంది.
 • శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో బాటు చర్మపు మృతకణాలను తొలగించటానికి రాగిపాత్ర నీరు దోహదం చేస్తుంది.
 • రాగి బిందెలో నీళ్లు తాగడం వల్ల ఎముకలు గట్టిపడటంతో బాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 • అధిక రక్తపోటు, కీళ్ల సమస్యలున్న వారు రోజూ రాగి పాత్రల్లో నీళ్లను తాగితే సమస్యలు అదుపులో ఉంటాయి.
 • రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటికి క్యాన్సర్ కణాలను నిరోధించే శక్తి ఉందని ఇటీవలి పరిశోధనల్లో రుజువైంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE