ఔషధ మొక్కల్లో తులసి స్థానం ఎంతో ప్రత్యేకం. తులసి ఆరోగ్య సంరక్షిణి గనుకే మన పూర్వీకులు తులసి పూజ, తులసి తీర్థ సేవనం నాటి సమాజంలో రోజువారీ విధులుగా ఉండేవి. ముఖ్యంగా.. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చితకా అనారోగ్యాలకు తులసి మంచి , తక్షణ ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్య పరిరక్షణలో తులసి ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. 

ఉపయోగాలు

  • రోజూ 4 తులసీ దళాలు తినటం వల్ల ఒంట్లోని వ్యర్థాలు తొలగిపోవటమే గాక రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • రొమ్ము పడిసెం పట్టి గొంతు గరగర,దగ్గు వస్తుంటే తులసి తీసుకుంటే ఊపిరితిత్తుల్లో చేరిన కఫం కరిగి దగ్గినప్పుడు బయటకి పోతుంది.
  • గొంతు బొంగురుపోయినప్పుడు తులసి రసం, మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే సమస్య పరిష్కారమవుతుంది.  
  • నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు రోజూ 2 తులసీ దళాలు నమిలితే సరి.
  • పరగడుపున తులసి ఆకురసం, తేనె, అల్లం రసం చెంచా చొప్పున కలిపి తీసుకుంటే జీర్ణకోశ సమస్యలుండవు.
  • ఇంట్లో తులసి ఉంటే దాని ఘాటైన వాసనకు అక్కడి దోమలు పరారవుతాయి. కాబట్టి మలేరియా బెడద తగ్గుతుంది.
  • క్షయ కారక బ్యాక్టీరియాను తులసి ఆదిలోనే అరికడుతుందని పలుపరిశోధనల్లో తేలింది.
  • తులసి రసం, బెల్లం కలిపి నీటితో కలిపి తాగితే రక్తశుద్ధి జరుగుతుంది.
  • టీ, కాఫీలకు బదులు తులసి టీ తాగితే జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలు దరిజేరవు.
  • తులసి వాడితే పలు చర్మ వ్యాధులు, ఉబ్బసం ఉపశమిస్తాయి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE