బొద్దుగా ఉన్న పిల్లలను చూస్తే ఎంతో ముద్దుగా ఉంటుంది. అదే.. వయసు పెరిగినా అదే పరిస్థితి కొనసాగితే అది క్రమంగా ఊబకాయంగా మారి అనారోగ్యాలకు కారణమవుతుంది. అస్తవ్యస్త జీవన శైలి వల్ల సంక్రమించిన ఈ ఊబకాయాన్ని మెరుగైన ఆహారపుటలవాట్లతో వదిలించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న 4 రకాల పానీయాల సాయంతో అధిక బరువు సమస్యకు దూరంగా ఉందాం.  

  • రోజూ కప్పు దాల్చిన చెక్క టీ తాగితే అధికబరువు సమస్య తప్పక దారికొస్తుంది. కప్పు నీళ్లు మరిగించి అందులో చెంచా దాల్చిన చెక్కపొడి, 1 లేదా 2 చెక్క ముక్కలు వేసి మరో 10 నిమిషాలు మూతపెట్టి సన్నని సెగమీద మరగనిచ్చి వడపోసి ఉదయం, సాయంత్రం అరకప్పు, చొప్పున తీసుకొంటే అధికబరువు తగ్గటం మొదలవుతుంది.  
  • కప్పు నీటిని మరిగించి అందులో 1 గ్రీన్ టీ బ్యాగ్ వేసి 4 నిమిషాలుంచి తీసి , ఇందులో చిటికెడు అల్లం తురుము కలిపి పరగడుపున తాగాలి. కాస్త వగరుగా ఉండే ఈ పానీయాన్ని ఉదయాన్నేతాగలేకపోతే చెంచా తేనె కలుపుకోవచ్చు. 
  • గుప్పెడు తాజా గులాబీ రేకలు (రసాయనాలు వాడనివి మాత్రమే వాడాలి) గిన్నెలో వేసి 3 గ్లాసుల నీరు పోసి మూతపెట్టి సన్నని సెగమీద 20 నిమిషాలు కాచాలి. పూరేకలు రంగు మారిన తర్వాత దించి ఆరనిచ్చి గాజు సీసాలోకి వడకట్టి ఫ్రిజ్ లో పెట్టి రోజుకో అరకప్పు చొప్పున పరగడుపున తాగితే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. 
  • 2 గ్లాసుల నీళ్లలో 5 చెంచాల నిమ్మరసం పిండి అందులో చెంచా నల్లమిరియాల పొడిని వేసి రెండుపూటలా కప్పు చొప్పున భోజనం తర్వాత ఒక గ్లాసు తాగాలి. దీనివల్ల రక్తంలో కొవ్వు తగ్గటమే గాక తిన్న ఆహారంలోని పోషకాలు పూర్తిగా వంటబడతాయి.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE