హోలీ రోజు ఒంటికి అంటిన రంగు మరకలు పూర్తిగా వదిలి పోవాలంటే వీలున్నంత త్వరగా స్నానం చేయాలి. అయితే..కేవలం స్నానంతో వదిలి పోని రంగుమరకల కోసం మాత్రం ఈ చిట్కాలు పాటించాల్సిందే. 

  • హోలీ ఆడాక కుళాయికింద పది నిమిషాలు నిల్చోని అంటిన రంగులన్నీపోయేలా చూడాలి. ఈ సమయంలో గట్టిగా రుద్దడం, గీరడం చేయొద్దు.
  • ఒంటికి సున్నిపిండి ఒంటికి పట్టించుకొని దానిపై కుంకుడుకాయ తొక్కుతో ఒళ్ళంతా శుభ్రంగా రుద్ది స్నానం చేస్తే ఎంత గాఢమైన రంగులైనా వదిలిపోతాయి. ఇంకా మిగిలిపోతే మరునాటి ఉదయం మరోమారు ఇలా చేస్తే సరి.
  • 2 గుప్పెళ్ళ శనగపిండిలో గరిటెడు పెరుగుపెరుగు, చెంచా రోజ్ వాటర్ కలిపి ముద్దగా చేసి దీన్ని రంగు మరకల మీద రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి చన్నీటితో స్నానం చేస్తే రంగు మరకలు తొలగిపోతాయి.
  • మూడు చెంచాల బాదం గింజల పొడిలో చెంచా తేనె, 2 చెంచాల పాలు, చెంచా నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని రంగులున్న చోట పూసి బాగా రుద్ది స్నానం చేస్తే రంగు మరకలు తొలగిపోతాయి.
  • అరటిపండు గుజ్జులో చెంచా చొప్పున పాలు, తేనె కలిపి గుజ్జుగా చేసి దీన్ని రంగులున్నచోట రాసి ఆరిన తర్వాత సున్నిపిండితో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానంచేస్తే శుభ్రం చేస్తే అంటిన రంగు పూర్తిగా తొలగిపోతుంది.
  • శనగ పిండి, బియ్యం పిండిని 2 చెంచాల చొప్పున తీసుకొని దానిలో అరచెంచా పసుపు, 4 చెంచాల రోజ్ వాటర్ కలిపి ముద్దగా చేసి రంగులాంటినా చోట రుద్ది స్నానం చేస్తే రంగుమరకలు వదిలిపోవటమే గాక దద్దుర్లు రాకుండా చూసుకోవచ్చు.
  • గరిటెడు కలబంద గుజ్జులో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్నిఒంటికి పట్టించి ఆరిన తరువాత సున్నిపిండితో రుద్ది స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి.
  • చెంచా ముల్తానీమిట్టిని తగినన్ని నీళ్లతో కలిపి ఆ మిశ్రమాన్ని రంగులు పడిన చోట రాసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే రంగులు వదిలిపోతాయి.
  • లిక్విడ్‌ సోప్‌తో స్నానం చేయాలి. స్నానం చేశాక కూడా చిరాకుగా ఉంటే నిమ్మరసం, పెరుగు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని రాయాలి.
  • 2 గరిటెల గోధుమపిండిలో చెంచా పసుపు తడి ఒంటికి పట్టించి పావుగంట తరువాత పచ్చిపాలతో కడిగేస్తే రంగులు వదిలిపోతాయి.Recent Storiesbpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE