• HOME
  • చిట్కాలు
  • ఆరోగ్యం కోసం గోరువెచ్చని నీరు తాగాల్సిందే!

మెరుగైన జీవక్రియల నిర్వహణల మొదలు మంచి ఆరోగ్యం కోసం రోజూ సరిపడా గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పలు జీవన శైలి సమస్యలకూ ఇది చక్కని పరిష్కారమని వారు చెబుతున్నారు. రోజూ గోరు వెచ్చని నీరు తాగితే కలిగే ఫలితాలేమిటో మనమూ తెలుసుకొందాం.

  • కాలకృత్యాల కంటే ముందు 2 గ్లాసుల గోరు వెచ్చని నీటిని కొద్దికొద్దిగా తాగితే సుఖవిరేచనం అవుతుంది.
  • రోజూ 2 పూటలా పావు లీటరు చొప్పున గోరువెచ్చని నీరు తాగితే ఆకలి అదుపై శరీరంలో కొవ్వు కరిగి అధిక బరువు సమస్య దారికొస్తుంది.
  • గోరువెచ్చని నీరు తాగే వారిలో శరీర ఉష్ణోగ్రత పెరిగి, జీవక్రియలు ఊపందుకొంటాయి. చిరుచెమట పట్టి స్వేద రంధ్రాలు తెరుచుకొని లోపలి వ్యర్థాలూ వదిలిపోతాయి.
  • గోరువెచ్చని నీటికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
  • మసాలా వంటకాలు తిన్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగై అజీర్తి వంటి సమస్యలు రావు.
  • గోరువెచ్చని నీరు తాగితే కఫ సంబంధిత జలుబు, దగ్గు నుంచి రక్షణ లభిస్తుంది.
  • ఒళ్లు నొప్పులు ఉంటే గోరువెచ్చని నీరు తాగితే రక్తప్రసరణ మెరుగై నొప్పి ఉపశమిస్తుంది. కిడ్నీ సమస్యలూ రావు.
  • మైగ్రైన్ తలనొప్పి బాధితులు నెలరోజులు గోరు చెచ్చని నీరు తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE